టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కొద్దిరోజుల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక అంతకముందు భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో మరొక రెండు విజయాలు అందుకున్న సూపర్ స్టార్, మొత్తంగా సరిలేరు తో మూడవ విజయం కూడా అందుకుని హ్యాట్రిక్ కొట్టారు. ఆ సినిమా విజయోత్సాహంలో ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు టూర్ వెళ్లొచ్చిన సూపర్ స్టార్, ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశాన్ని లాకౌట్ చేసిన కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం సరదాగా గడుపుతున్నారు.
ఇక అతి త్వరలో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు మహేష్. లాకౌట్ ముగిసిన అనంతరం ప్రారంభం కానున్న ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రారంభం అయినట్లు టాక్. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా పలు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ ఎంపికయినట్లు తాజా సమాచారం.
ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావించారట, అయితే ఆమెకు ప్రస్తుతం కాల్షీట్స్ లేకపోవడంతో దర్శకుడు పరశురామ్ ఆలియా పేరు సూచించడం, ఆపై సినిమా విషయమై ఇటీవల ఫోన్ లో ఆమెను సంప్రదించడం జరిగిందని, అలానే మహేష్ కూడా ఆమెకు ఈ క్యారెక్టర్ ఎంతో బాగుంటుందని చెప్పినట్లు టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సరసన నటిస్తున్న ఆలియా, అతి త్వరలో సూపర్ స్టార్ సరసన కూడా నటించడం ఖాయం అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త పై సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!