ఒకప్పుడు బుల్లితెరపై రాజ్యమైలిన సీరియల్స్ రామాయణం, మహాభారతం ఇప్పుుడు మరోసారి దూరదర్శన్ లో వాటి సత్తా చాటుతున్నాయి. తొలిసారి రామయణం సీరియస్ 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్‌లో ప్రసారం అయ్యింది. ఈ సీరియల్ ఇండియన్ టెలివిజన్ రేటింగ్స్‌ను మార్చేసింది. తాజాగా బాలీవుడ్ నటి నటి దీపికా చిక్లియా టీవీ రామాయణంలో నటించిన తారాగణం, సిబ్బందికి సంబంధించిన అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీపిక షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ ఫొటోలో రావణుడు మినహా మిగిలిన వారందరూ ఉన్నారని దీపిక రాశారు.
ఇప్పుడు వారిలో కొంతమంది మన మధ్యలో లేరని తెలిపారు. వారికి నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఇటీవల ఈ ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 10 వరకు ఒక ఎపిసోడ్, ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేస్తారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. కాగా బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) నివేదిక ప్రకారం, గత వారాంతంలో నాలుగు ప్రదర్శనలలో రామాయణం 170 మిలియన్ల ప్రేక్షకులను దక్కించుకుంది.