ప్రముఖ దర్శకుడు మణిరత్నం నటి సుహాసిని హాసన్ నిర్వహించిన ఇంస్టాగ్రామ్ లైవ్ లో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి అస్సలు ఇష్టపడని మణిరత్నం సుహాసిని హాసన్ నిర్వహించిన ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఎన్నో వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం తో సహా నెటిజనులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. ఇంస్టాగ్రామ్ లైవ్ లో మణిరత్నం భార్యతో సహా హీరో మాధవన్, సీనియర్ నటీమణి కుష్బూ ఇంకా ఇతర సెలబ్రిటీలు కూడా భాగస్వాములయ్యారు. ఈ క్రమంలోనే నటి సుహాసిని హీరో మాధవన్ తో మాట్లాడుతూ... ' మాధవన్... నువ్వు మణిరత్నం గారికి గోల్ఫ్ ఆట నువ్వు నేర్పించిన తర్వాత అతని జీవితమే మారిపోయింది' అని అంటారు. దానికి హీరో మాధవన్ స్పందిస్తూ... ' గోల్ఫ్ ఆట లో నన్ను ఓడించాలని మణిరత్నం సార్ కి నేను ఎన్నోసార్లు చాలెంజ్ విసిరాను. కానీ ఆయన మాత్రం నా మీద చెత్త విసిరారే తప్ప నాతోపాటు గోల్ఫ్ ఆడలేదు' అని ఆయన చెప్పుకొచ్చాడు. 


ఇకపోతే నెటిజనులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. సౌత్ ఆడియన్స్ ఆల్ టైం ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం. అయితే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్ అని ఒక నెటిజన్ అడగగా... తనకు దర్శకుడు లిజో జొస్ పెళ్ళిసేరీ అంటే బాగా ఇష్టం అని, లిజో జొస్ తీసిన సినిమాలు చూసేందుకు తాను బాగా ఆసక్తి చూపుతారని తెలిపారు. లిజో జొస్ పెళ్ళిసేరీ అంగమలై డైరీస్, జల్లికట్టు లాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

 

 

లాక్ డౌన్ సమయంలో తాను వేరొక స్క్రిప్టు రాసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు. 'పొన్నియిన్ సెల్వన్' సినిమా చిత్రీకరణ పూర్తిగా అయిపోయిన అనంతరం తానూ తన తదుపరి సినిమాపై వర్క్ చేస్తానని తెలిపారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాని రెండు భాగాలలో విడుదల చేస్తానని ఆయన తెలిపారు. దర్శకుడు లిజో జొస్ పెళ్ళిసేరీ... తన జల్లికట్టు సక్సెస్ తరువాత ఛుజలి అనే సినిమాని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: