పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ ను మాటలతో మాయ చేసానని స్వయంగా పూరీయే అన్నాడు. ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్న పూరి, ఇప్పుడు ఏ దర్శకుడిని నమ్మలేని స్థితిలో ఉన్న జూనియర్ ను తన మాటలతో మాయ చేసాడు. హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించడంలో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఏ సినిమాలో ఎలా కనిపించినా పూరి సినిమాల్లో మాత్రం హీరోలు ప్రేత్యేకంగా కనిపిస్తారు. అంతేకాదు రొటీన్ కు భిన్నంగా బిహేవ్ చేస్తారు. అందువల్లనే టాలీవుడ్ స్టార్స్ అందరు పూరీతో పనిచేయడానికి ఇష్టపడతారు. పూరి కెరీర్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలైన సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది ‘ఆంధ్రావాలా’. విడుదలకు ముందు ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. నిమ్మకూరులో ఆ సినిమా ఆడియో ఫంక్షన్ నేటికీ ఓ రికార్డే. ‘సింహాద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత జూనియర్ చేసిన సినిమా అవ్వడంతో... ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ స్థాయి అంచనాలను అప్పట్లో ‘ఆంధ్రావాలా’ అందుకోలేకపోయింది. ఇది పదేళ్ల నాటి మాట. అప్పట్నుంచీ విడివిడిగా తారక్, పూరి ఎన్ని విజయాలను అందుకున్నా ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేకపోయారు. అయితే ‘హార్ట్ ఎటాక్’ తర్వాత పూరి చేయబోయే సినిమా ఏంటి అనే విషయంపై మీడియాలో రకరకాల ఊహాగానాలకు పూరి తెరదించి నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం జూనియర్ చేస్తున్న ‘రభస’ షూటింగ్ పూర్తి కాగానే తన చిత్రంలో చేయడానికి జూనియర్ ను పూరి ఒప్పించాడు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుస ఫైల్యుర్స్ ఇస్తున్న పూరీని జూనియర్ ఎంచుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు ఏమాటలు చెప్పి ఏమి మాయచేసాడో పూరి అంటు సెటైర్లు కూడా పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: