దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా సెల్ప్ హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. చిత్ర పరిశ్రమ పూర్తిగా షెట్ డౌన్ అయ్యింది. దాంతో సెలబ్రెటీలు ఇంటిపట్టున ఉంటే సందేశాలు..తమకు తోచిన సూచనలు ఇస్తున్నారు. మరికొంత మంది వంటకాలు వండుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు.
లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ కిష్టమైన పనులు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు.జుహీచావ్లా తన ఇంటి ఆవరణలో విత్తనాలు చల్లుతుంది. కంగనా రనౌత్ మనాలీలోని ఇంటిలో కుటుంబసభ్యులతో కలిసి జూదం ఆడుతుంది. చాలా మంది హీరోయిన్లు రక రకాల విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు.