ప్రపంచాన్ని మొత్తం ఇప్పుడు కరోనా భూతం పట్టి పీడస్తుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిది ఈ దిక్కుమాలిన వైరస్ ప్రపంచంలోని 205 దేశాలను పట్టి పీడిస్తుంది. ఇప్పటి కే లక్ష దాటిన మరణాలు.. లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి.  ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మార్చింది. ఎక్కడి వ్యవస్థలు అక్కడే ఆగిపోయాయి.  మనుషులను దూరంగా ఉంచుతున్నారు... తుమ్మినా, దగ్గినా కిలోమీటర్ పారిపోతున్నారు.  ఇలాంటి సమయంలో ప్రజలను చైతన్య పరిచేందుకు సినీ, ఇతరు కళాకారులతో కరోనాపై రక రకాలుగా అవగాహన కలిగేలా చేస్తున్నారు.

 

తాజాగా క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం పోరాడుతున్న హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు సంఘీభావంగా భారీ షోను నిర్వ‌హిచ‌నున్నారు.  ప్ర‌పంచ‌దేశాల‌కు చెందిన మేటి పాప్ స్టార్ల‌తో ఈ షోను ఏర్పాటు చేస్తున్నారు.  ఆన్‌లైన్‌, టీవీల్లో ఈ క‌చేరిని లైవ్ చేయ‌నున్నారు.  ద వ‌న్ వ‌ర‌ల్డ్‌- టుగెద‌ర్ ఎట్ హోమ్ అన్న నినాదంతో ఈ షోను నిర్వ‌హిస్తున్నారు.  సుమారు 100 మంది ఆర్టిస్టుల‌తో ఈ షో ఉంటుంది. 

 

రోలింగ్ స్టోన్స్‌, బిల్లీ ఎల్లిష్‌లు కూడా దీంట్లో ప‌ర్ఫార్మ్ చేస్తారు. అమెరికా టీవీ ఆర్టిస్టులు స్టీఫెన్ కోబ‌ర్ట్, జిమ్మీ కిమ్మ‌ల్‌, జిమ్మీ ఫాల‌న్ ఈ షోను హోస్ట్ చేస్తారు. ఎల్ట‌న్ జాన్‌, టేల‌ర్ స్విఫ్ట్‌, ఓప్రా విన్‌ఫ్రేలు దీనికి హాజ‌రు అవుతారు. రోలింగ్ స్టోన్ బ్యాండ్‌కు చెందిన మిక్ జాగ‌ర్‌, కీత్ రిచ‌ర్డ్స్‌, చార్లీ వాట్స్‌, రొన్నీ వుడ్‌లు కూడా పాల్గొంటున్నారు.  ఈ ప్రోగ్రామ్ దాదాపు 8 గంట‌లు సాగే ఈ ఈవెంట్‌ను గ్లోబ‌ల్ సిటిజ‌న్ మూమెంట్‌తో పాటు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిర్వ‌హిస్తున్న‌ది.  సూప‌ర్ స్టార్ లేడీ గాగా ఆధ్వ‌ర్యంలో క‌న్‌సర్ట్ న‌డ‌వ‌నున్న‌ది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: