టాలీవుడ్ స్థాయి పెంచి ఇండియన్ ఫిలిమ్ బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా బాహుబలి, బాహుబలి 2.  దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్  స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా ఎలుగెత్తి చాటేలా చేశాడు.  బాహబలి జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగించింది.  ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీ ఎప్పుడెప్పుడా అని అటు నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.   సినిమాలో కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. కథాపరంగా ఈ ఇద్దరూ ఎలా కలుసుకుంటారనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

ఆ మద్య ఉగాది కానుకగా ‘రౌద్రం రణం రుధిరం’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో తమ గ్రామాల్లో అన్యాయాలను సహించకుండా ప్రశ్నించేవిగా ఈ రెండు పాత్రలు కనిపిస్తాయట. ఒకానొక సందర్భంలో వేరు వేరుగా ఈ రెండు పాత్రలు అజ్ఞాతంలోకి వెళతాయి. అడవితల్లిని ఆశ్రయించిన ఈ ఇద్దరికీ అక్కడ స్వాతంత్ర్యకాంక్ష కలిగిన యోధుడైన అజయ్ దేవగణ్ తారసపడతాడు.

 

ఆయన భావజాలం ఆ ఇద్దరి పాత్రలను ప్రభావితం చేయడంతో, తమలోని శక్తియుక్తులను స్వాతంత్ర్య సాధనకు వినియోగిస్తారని అంటున్నారు.  ఆర్‌ఆర్‌ఆర్‌' పాన్ ఇండియా చిత్రం  అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫైనల్ చేశాం అని రాజమౌళి అంటున్నారు. అయితే అదే సమయం లో థియేటర్లు నడవాలంటే ఇంకా ఆరు నెలలు పడుతుంది తెలిపాడు రాజమౌళి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేటట్లు కనిపించడం లేదు. అలాగే ప్రజలకు కూడా ఈ వైరస్ పై భయం పూర్తిగా తొలిగిపోయి తిరిగి వారు యథావిధిగా థియేటర్లకు రావాలంటే కనీసం ఇంకా ఆరు నెలల సమయం పడుతుందని వివరించాడు జక్కన.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: