టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళికి దర్శకుడు సుకుమార్ అంటే ఎంతో అభిమానం. గతంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇష్టమైన దర్శకుడు ఎవరు అనే ప్రశ్నకు రాజమౌళి సుకుమార్ అని సమాధానం ఇచ్చారు. తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకు హాజరైన రాజమౌళి సుకుమార్ ఎంచుకునే కథలు అద్భుతంగా ఉంటాయని వ్యాఖ్యలు చేశారు. 
 
ఎవ్వరూ తీయని విధంగా సినిమాలు తీయడమే సుకుమార్ గొప్పదనం అని ఆయనను ప్రశంసించారు. అందువల్లే తాను సుకుమార్ ను అభిమానిస్తానని రాజమౌళి చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను ఆర్య సినిమా చూసినప్పుడు సుకుమార్ తనకు పోటీ అవుతాడనిపించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ తనకు మంచి స్నేహితుడని... ఆర్య సినిమా చూసిన తరువాత సుకుమార్ తో స్నేహం చేయడం మొదలుపెట్టానని అన్నారు. 
 
మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన నేనొక్కడినే చిత్రంలోని ఒక సన్నివేశం తనకు బాగా ఇష్టమని అన్నారు. నేనొక్కడినే సినిమా టీజర్లో మహేష్ బాబు స్టిల్ ను చూసి తనకెందుకు అలాంటి ఐడియా రాలేదని తెగ ఫీలయ్యానని చెప్పారు. ఈ తరంలో తనకు నచ్చిన దర్శకుడు సుకుమార్ అని ఆయన కథ చెప్పే విధానం చాలా బాగుంటుందని అన్నారు. రాజమౌళి ఈ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్‌ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించారు. 
 
ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని.... చరిత్రకు ఈ సినిమాకు సంబంధం లేదని... ఫిక్షనల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2021 సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: