ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిన హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో తన జీవితంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి వందల కోట్ల అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం మీరందరూ లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉంటున్నారు కాబట్టి... మీకోసం మేము లియోనార్డో యొక్క 3 గొప్ప సినిమాలను ఈ ఆర్టికల్ లో సజెస్ట్ చేస్తున్నాం.


1. ఇన్సెప్షన్

లియోనార్డో డికాప్రియో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో ఇన్సెప్షన్ మూవీ బాగా ప్రాచుర్యం చెందింది. జూ. ఎన్టీఆర్ కూడా ఒక సినిమాలో ఇన్సెప్షన్ మూవీ నేమ్ మెన్షన్ చేస్తాడు. ఈ సినిమా ఎంతగా పాపులర్ అయిందంటే జబర్దస్త్ షోలో కూడా ఓ ప్రముఖ హాస్యనటుడు ఈ సినిమా స్టోరీలైన్ పై ఒక స్కిట్ ని రూపొందించాడు. చిత్రం యొక్క కథ గురించి తెలుసుకుంటే... లియోనార్డో డికాప్రియో ఈ సినిమాలో ఒక టెక్నాలజీని ఉపయోగించుకుని కార్పొరేట్ వ్యాపారవేత్తలని నిద్రబుచ్చి వారి కల లోకి వెళ్లి కీలకమైన రహస్యాలను దొంగలిస్తాడు. అయితే ఒక సందర్భంలో మాత్రం ఓ సంస్థ యొక్క చైర్మన్ మెదడులోని బిజినెస్ ఆలోచనల్ని మొత్తం తుడిచివేసి అతడి ని సాధారణ వ్యక్తిగా మార్చాల్సిన ఒక డీల్... డికాప్రియో కి దక్కగా తాను ఆ చైర్మన్ ని మూడో స్టేజ్ ల డ్రీమ్స్ లలోకి తీసుకెళ్లి తన పని పూర్తి చేస్తాడు. ఈ సినిమాలో గ్రాఫిక్స్, కథ ఇంకా మిగతా అంశాలు అన్ని కూడా చాలా అద్భుతంగా, అత్యాధునికంగా ఉంటాయి.


2. షట్టర్ ఐలాండ్

ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో నటనా ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించిన షట్టర్ ఐలాండ్ ఇప్పటికీ ఉత్తమమైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలలో మొదటి స్థానంలో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో చివర్లో ఉండే ఒక ట్విస్ట్ కి ఎవరైనా వావ్ అనకొండ ఉండలేరు. చనిపోయే ముందు చూడాల్సిన సినిమాలలో ఇది ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రం బెస్ట్ ఛాయిస్ అవుతుంది.


3. టైటానిక్

చరిత్రలో ఏ హాలీవుడ్ సినిమా సృష్టించని ప్రకంపనలు టైటానిక్ సినిమా సృష్టించి లియోనార్డో డికాప్రియో, కేట్ విన్సలేట్ లకు విపరీతమైన స్టార్ డం తెచ్చి పెట్టింది. ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలతో కొనసాగే ఈ సినిమా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఎంతో అలరించింది. ఎన్నిసార్లు ఈ సినిమా చూసినా బోర్ కొట్టదు. ఈ లాక్ డౌన్ సమయంలో అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రాలలో టైటానిక్ ఒకటి. 

మరింత సమాచారం తెలుసుకోండి: