నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన చిరంజీవి భారతదేశంలోని ఉత్తమ నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. బహుముఖ నటుడు గా వందల చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్నారు..మొన్నామధ్య సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరోగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. భారతదేశం అంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ... ప్రతి ఒక్కరు టీవీలకు అతుక్కుపోతున్నారు. అయితే అలాంటి వారి కోసం మేము 5 చిరంజీవి సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో చెప్పబోతున్నాం.
1. ఖైదీ
చిరంజీవిని మెగా స్టార్ గా తీర్చిదిద్దిన సినిమా ఖైదీ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో తన తండ్రిని సోదరుడిని చనిపోయిన వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొంటూ చివరికి అసలు నేరం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు చిరంజీవి. సినిమాలు చూడాలనుకునే వారికి ఖైదీ ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
2. జగదేకవీరుడు అతిలోకసుందరి
ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల తార శ్రీదేవి నటించారు. దేవలోకం నుంచి వచ్చిన ఇంద్రుని కుమార్తె ఇంద్రజ( శ్రీదేవి) సాధారణ మానవుడు ఐన రాజ్ ( చిరంజీవి) ప్రేమలో పడుతుంది. వీరిద్దరి మధ్య సాగే ఫాంటసీ చిత్రమే జగదేకవీరుడు అతిలోకసుందరి. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్ అయ్యింది.
3. ముఠామేస్త్రి
ముఠామేస్త్రి సినిమా లో చిరంజీవి నటించిన అందుకుగాను అతనికి ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో బోస్( చిరంజీవి) బాగా దేశభక్తి గల వ్యక్తి. స్థానిక మార్కెట్ కార్మికుల హక్కుల కోసం బోస్ ఆత్మ కి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతాడు.
4. ఇంద్ర
ఇంద్ర మూవీ లోని మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో దాయి దాయి దామా పాటకి చిరంజీవి వేసిన స్టెప్పులు తెలుగు ఇండస్ట్రీలో ఓ పెద్ద సంచలనం సృష్టించాయి. చిరంజీవి సినీ చరిత్రలో ఎక్కువ డబ్బులు వసూలు చేసిన సినిమాల్లో ఇంద్ర మొట్టమొదటి సినిమా. ఇంద్ర మూవీ సత్యం థియేటర్ లో ఏకంగా 227 రోజులు ఆడింది. మిగతా 32 థియేటర్లలో 175 రోజులు పాటు ఆడి రికార్డు సృష్టించింది.
5. ఠాగూర్
చిరంజీవి సినీ చరిత్రలో ఠాగూర్ సినిమా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాగా పేరు తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను తెచ్చిపెట్టడంలో ఠాగూర్ చిత్రం సక్సెస్ అయ్యింది అని చెప్పుకోవచ్చు.