నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ భామ మెహ్రీన్ పీర్జాదా. కాగా తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుని తెలుగు ప్రేక్షకుల నుండి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్, ఆ తరువాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మరొక రెండు విజయాలు అందుకుని మంచి పేరు సంపాదించింది. ఇక ఇప్పటివరకు మొత్తం ఏడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్, అటు హిందీ తో పాటు, తమిళ్, పంజాబీ సినిమాల్లో కూడా అక్కడక్కడా నటించడం జరిగింది. 

 

ఇక ఇప్పుడిప్పుడే మెల్లగా తన టాలెంట్ తో మంచి అవకాశాలు సంపాదిస్తున్న మెహ్రీన్, అతి త్వరలో ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కనున్న ఎఫ్3 సినిమాలో ఒక హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు దగ్గర ఉంటూ, వారితో తన సినీ, వ్యక్తిగత విషయాలు పంచుకునే అలవాటున్న మెహ్రీన్, ప్రస్తుతం మన దేశం మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో, తన కుటుంబసభ్యులతో కలిసి ఎంతో సరదాగా గడుపుతోంది. 

 

అలానే మధ్యలో తనకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న మెహ్రీన్, నిన్న పోస్ట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా లో ఏదో ఒకరకమైన ఛాలెంజ్ లు రన్ అవుతున్న నేపథ్యంలో, నిన్న పేపర్ ఛాలెంజ్ లో భాగంగా గోడకు అనుకుని చేతులు భూమి మీద ఉంచి, కళ్ళు పైకెత్తి నోటితో పేపర్ ని అందుకునే ఈ ఛాలెంజ్ ని సాధించాలని ఎంతో ప్రయత్నం చేసిన మెహ్రీన్, ఒక్కసారిగా మిస్ అయి హఠాత్తుగా కిందపడిపోవడం జరిగింది. అయితే ఆవెంటనే తేరుకుని లేచి నిలబడి మెహ్రీన్, తనకు ఏమి కాలేదని ఒక్కోసారి కొన్ని సాధించాలని అనుకున్నపుడు ఇలాంటివి తప్పవంటూ ఆ వీడియో పోస్ట్ లో తెల్పింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: