ఏ మాయ చేశావే సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన రామయ్యా వస్తావయ్య వరకు సమంతా అంటే క్యూట్ అండ్ బబ్లీ గర్ల్. అవే క్యారక్టర్లలో సూపర్ గా నటించి ఆకట్టుకుంది సమంత. అదే నటనతో టాలీవుడ్ ఆడియెన్స్ మనసు దోచేసింది ఈ చెన్నై సుందరి. కాని తను చేయబోతున్న కోలీవుడ్ సినిమా అంజాన్ లో సమంతా ఫుల్ మాస్ రోల్ ప్లే చేస్తుందట.
ఎపిహెరాల్డ్.కామ్ కి ఎక్స్ క్లూజివ్ గా అందిన సమాచారం ప్రకారం ఇంతవరకు సమంతా చేయని ఫుల్ మాస్ క్యారక్టర్ అంజాన్ సినిమాలో చేస్తుదట. క్లాస్ క్యారక్టర్లు చేసి విసుగొచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు మాస్ ఆడియెన్స్ ని కూడా అలరించడానికి ట్రై చేస్తుందట. అయినా సమంతా ఎప్పటిలా ఉంటేనే అందరికి ఇష్టం అంటున్నారు కొందరు అభిమానులు. కాని అంజాన్ సినిమాలో సమంతా క్యారక్టర్ కూడా చాలా మాసీగా ఉంటుందట. అందుకే రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్స్ లో సమంతా ఫుల్ మాస్ లుక్ తో కనపడింది.
ఎప్పుడు ఒకే టైప్ క్యారక్టర్స్ చేస్తే చేసే హీరోయిన్స్ కి.. చూసే ఆడియెన్స్ కి.. బోరే కాని సామంతా ఈ కొత్త ఫీట్ చేయడానికి గల కారణాలు కూడా వెతుకుతున్నారు కొందరు సిని పండితులు. వారికి దొరికిన సమాధానం ఏంటంటే ఇండస్ట్రీకి చాలా మంది కొత్త కొత్త అందాలు రోజు వచ్చి పలకరిస్తున్నాయి కొంచం కష్టపడకపోతే ఈ ఇమేజ్ పడిపోయే అవకాశం ఉందని నిర్ణయించుకుని కష్టపడుతుందని ఫిల్మ్ నగర్ ఇన్నర్ టాక్.
సో ఏది ఏమైనా సమంతాను ఫుల్ మాస్ క్యారక్టర్ లో ఊహించుకుని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆమె అభిమానులు. చూద్దాం ఈ క్యూట్ బేబీ మాసీ లుక్ లో ఎలా అలరించనుందో..
సమంతాకి మాస్ క్యారక్టర్లు సూట్ అవుతాయా..?
మరింత సమాచారం తెలుసుకోండి: