![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/politics_latestnews/anchor-shyamala-gurunchi-evariki-teliyani-nijalue5220f33-a7ad-44ad-b6fb-4ba576154329-415x250.jpg)
బుల్లితెర పై తనదైన సత్తా చాటి ఎంతగానో గుర్తింపు సంపాదించిన యాంకర్ శ్యామల. తనదైన అందం అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు.. బుల్లితెరపై కొన్నేళ్లపాటు హవా నడిపించింది అనే చెప్పాలి. ఇక మొదట్లో ఏ సినిమా ఈవెంట్ లో చూసినా శ్యామల నే దర్శనమిచ్చేది ఇక బుల్లితెరపై ఏ ప్రోగ్రాం లో చూసిన కనిపించేది. ఓవైపు బుల్లితెరపై ప్రోగ్రాంలు చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్లు ఇంకోవైపు సినిమాలు ఇలా ఎంతో బిజీ బిజీగా కెరియర్ లో విజయవంతంగా దూసుకుపోయింది శ్యామల.
అయితే పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మడు ఇప్పటికీ పలు షోలు ఈవెంట్ ల తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా వెళ్ళింది శ్యామల. బిగ్ బాస్ షో ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది అనే చెప్పాలి. అయితే యాంకర్ శ్యామల ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఎంతో యాక్టివ్గా తెరమీద కనిపిస్తుంది అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే యాంకర్ శ్యామల లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. యాంకర్ శ్యామల లవ్స్ స్టోరీలో సినిమాలను తలపించేలా ఎన్నో ట్విస్టులు ఫైట్ సీన్లు ఎన్నో ఉన్నాయి.
ముందుగా ఒక సీరియల్ షూటింగ్ లో తన హస్బెండ్ నరసింహ ము మొదటిసారి చూసిందట శ్యామల. మొదటి చూపుతోనే అతడి బిహేవియర్ ఆటిట్యూడ్ కి ఫ్లాట్ అయిపోయిందట. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అలా అలా ఇద్దరూ క్లోజ్ అయ్యారట. ఈలోగా శ్యామల అమ్మా, బావా కలిసి శ్యామలను ఊరు తీసుకెళ్లాలని భావించారు. ఇక ఆ ప్లాన్ పసిగట్టిన శ్యామల వేరే వాళ్ల ఫోన్ నుంచి నరసింహ కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పిందట శ్యామల. ఇక ఆ సమయంలో నర్సింహా ఎక్కడో ఉండడంతో ఆ లొకేషన్ కి తన ఫ్రెండ్ కి పంపితే అక్కడ ఓ చిన్న సైజ్ ఫైట్ కూడా జరిగిందట. అయితే అప్పుడు శ్యామల వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమేనట. ఇక ఆ తర్వాత ఎన్నో గొడవలు తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.