![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/venkatesh-trisha-love-based-movie-completes-13-yearsbbfe92b5-cade-45ec-b82a-8d2c4b020434-415x250.jpg)
ప్రేమకథలకు ఎప్పుడూ మొనాటనీ ఉండదు. వీటితో పాటు కుటుంబ కథలకు కూడా అంతే స్పేస్ ఉంటుంది. ఓ హీరో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమంటే మాటలు కాదు. తెలుగు సినిమాల్లో కుటుంబకథా సినిమాలకు కమర్షియల్ టచ్ ఇచ్చిన హీరోగా వెంకటేశ్ కు పేరు ఉంది. ప్రేమకథా సినిమాలను కూడా తనదైన స్టైల్లో చేసి మెప్పించాడు. ఈ రెండు థీమ్ లను కలిపి వెంకీ చేసిన ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే సినిమా సూపర్ హిట్ అయింది. నేటితో ఆ సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.
వెంకటేశ్, త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఆ సినిమా 2007 ఏప్రిల్ 27న విడుదలైంది. చిత్ర కథాంశం ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ తో, సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడుస్తుంది. త్రిష సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తన అందంతో సినిమాకు ప్లస్ అయింది. వెంకటేశ్ తనదైన స్టైల్లో నటించి మెప్పించాడు. వెంకీ-కోట.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ సీన్లు సినిమాకు బలంగా నిలిచాయి. లవ్ థీమ్ సబ్జెక్టును హీరో, హీరోయిన్లతో పాటు వాళ్ రెండు కుటుంబాలకు, స్నేహితులు లింక్ చేస్తూ దర్శకుడు శ్రీరాఘవ రాసుకున్న కథ ఆడియన్స్ ను మెప్పించింది.
యువన్ శంకర్ రాజా సంగీతంలోని అన్ని పాటలు సూపర్ హిట్టే. వెంకటేశ్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం కాగా.. వారి కెరీర్లో ఓ సూపర్ హిట్ గా నిలిచింది. ఇద్దరి జంట సినిమాకు ఆకర్షణగా నిలిచింది. సాయి దేవా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్, నాగ అశక్ ఈ సినిమాను నిర్మించారు. తమిళ్ రీమేక్ లో థనుష్, నయనతార నటించారు. అయితే.. వెంకటేశ్, త్రిష చేసిన మ్యాజిక్ చేయలేక పోయారు. ఈ సినిమా 20 సెంటర్లలో 100 రోజులు ఆడింది.
#13YearsForClassicAMAV - Team victory v pic.twitter.com/f2m4L5b5ZX
— venkatesh Daggubati (@VenkyMama) April 26, 2020