బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సినీ ఇండస్ట్రీలో కొంతకాలం మాత్రమే కథానాయకిగా నటించింది. ఒకవైపు తన భర్త కోట్ల రూపాయలను సినిమాల ద్వారా సంపాదిస్తుంటే... ట్రింకల్ ఖన్నా తన సొంత బిజినెస్ ద్వారా ఆయన కంటే ఎక్కువ డబ్బులను సంపాయించి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ట్వింకిల్ ఖన్నా తన తల్లి డింపుల్ కపాడియా తో కలిసి కొవ్వొత్తుల వ్యాపారాన్ని నడిపిస్తోంది. వాళ్ళ కొవ్వొత్తులు కేవలం ఇండియా లో మాత్రమే కాదు పక్క దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.
2001వ సంవత్సరంలో అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న ట్వింకిల్ ఖన్నా తన సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పేసింది. తాను ఇక ఎవరికీ కనిపించదని అందరూ అనుకున్నారు. కానీ వ్యాపారవేత్తగా అవతారమెత్తి అందరికీ పెద్ద ఝలక్ ఇచ్చింది. తాను కొవ్వొత్తుల వ్యాపారం తో సహా వైట్ హౌస్ అనే పేరుతో ఇంటీరియర్ డిజైనింగ్ వస్తువుల వ్యాపారం ప్రారంభించింది. ఈ రెండు వ్యాపారాలు విజయవంతంగా నడవటం వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవచ్చు.
ట్వింకిల్ ఖన్నా కు వ్యాపారం చేయడంతో పాటు వార్తా కథనాలను రాయడం కూడా వచ్చు. dna, ది టైమ్స్ అఫ్ ఇండియా లాంటి ప్రముఖ పత్రికల కు ఆమె అడపాదడపా కథనాలు రాస్తోంది. ఆమె రాసిన మిస్సెస్ ఫన్నీ బౌన్స్ నవల 2015 లో విడుదల కాగా... దాని కాపీలు లక్ష వరకు అమ్ముడుపోయాయి. ఆమె రెండవ నవల కాపీలు కూడా లక్షల సంఖ్యలోో అమ్ముడుపోయాయి. ఇలా ట్వింకిల్ ఖన్నా తన టాలెంట్ తో కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. ఎంత సంపాదించినా అక్షయ్ కుమార్ గాని ట్రింకల్ ఖన్నా గానీ ఎటువంటి గొప్పలకు పోరు. కరోనా పై యుద్ధంం చేసేందుకు తనవంతుగా 25 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు అక్షయ్ కుమార్.