తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ. ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది . ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో గ్లామర్ పాత్రల్లో కూడా మెరిసింది రమ్యకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసగి  తన సత్తా చాటింది. అయితే ఇక ఆ తర్వాత కూడా హీరోయిన్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  ఎన్నో ముఖ్య పాత్రలో నటించి తన నటనతో ఎంతో గుర్తింపు సంపాదించింది. అయితే రమ్యకృష్ణ కు వయసు పెరుగుతూ వస్తుంది కానీ అందం  మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. 

 

 

 ఇప్పటికీ యువ హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చే అందంతో సినిమాల్లో నటిస్తోంది రమ్యకృష్ణ. ఇక టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ప్రేమ వివాహం జరిగింది. కొన్ని రోజులపాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో కూడా ఎన్నో సినిమాల్లో  నటించింది. ఇక ఈ జంట గురించి టాలీవుడ్ లో ఎన్నో సార్లు ఎన్నో వార్తలు తెర మీదికి వచ్చి హల్ చల్ చేశాయి. 

 

 

 ముఖ్యంగా రమ్య కృష్ణ... కృష్ణ వంశీ  మధ్య మనస్పర్ధలు వచ్చి  ఇద్దరు దూరమైపోయారు అంటూ ఓ వార్త హల్చల్ చేసినప్పటికీ ఒకానొక సమయంలో రమ్యకృష్ణ దీనిపై క్లారిటీ ఇచ్చింది. సినిమాల్లో బిజీగా ఉండటం కారణంగా తాను చెన్నైలో ఉంటున్నానని  తన భర్త కూడా సినిమాల్లో బిజీగా ఉండడంతో హైదరాబాద్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కానీ తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు జరగలేదు అంటూ  క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే శ్రీ ఆంజనేయం సినిమా తర్వాత రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇప్పటివరకు నటించలేదు. ఇక బాహుబలి సినిమాలో ఎంతో గొప్ప పాత్ర చేసిన రమ్యకృష్ణ కు ఎన్నో ప్రశంసలు దక్కాయి కానీ భర్త కృష్ణవంశీ మాత్రం ఒక్క సారి కూడా ఆ పాత్ర గురించి మాట్లాడింది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: