టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరో అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. తన సొంత డబ్బులతోనే పార్టీ నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడినట్టు సమాచారం. అందుకే డబ్బు సంపాదించేందుకు మళ్ళీ సినిమాల్లో నటించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. తన రాజకీయ జీవితాన్ని, సినిమా జీవితాన్ని సరిసమానంగా నడపాలని భావించిన పవన్ కళ్యాణ్ ఓ పక్కా ప్రణాళికతో ముందుకు సాగిపోతున్నారు. ఇప్పటికే మూడు కొత్త చిత్రాలకు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రీకరణ కూడా పూర్తి చేశాడని సమాచారం.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా అతడి సరసన అనుష్క శెట్టి నటిస్తోందని సమాచారం. ఈ రెండు సినిమాలను మినహాయించి ఇంకో చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. అయితే పవన్ తో సినిమాలు చేసేందుకు ఇప్పటికీ ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆశ పడుతున్నాడని సమాచారం. ముఖ్యంగా ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత రామ్ తల్లూరి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీసేందుకు బాగా ఆశ పడుతున్నాడట.
జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ అవసరాల కోసం రామ్ తల్లూరి అడిగినన్ని డబ్బులు ఇచ్చాడంట. తన సహాయానికి కృతజ్ఞతా భావంతో ' రాము గారు, మీరు తీసే ఏదో ఒక సినిమాలో నేను కచ్చితంగా నటిస్తాను' అని ప్రామిస్ చేసాడట. ఇక అప్పటి నుండి తన సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తాడనే ఆశతో రామ్ తల్లూరి వేచి చూస్తున్నాడు. ప్రస్తుతానికి పవన్ 3 సినిమాలకు ఒప్పుకున్నాడు కాబట్టి... 4 వ చిత్రంలో అయినా ఆయన తన సినిమాలో నటించాలని ఆశలు పెట్టుకున్నాడు నిర్మాత రామ్. మరి పవన్ 3 సినిమాల షూటింగ్స్ పూర్తి చేసిన అనంతరం నిర్మాత రామ్ తో కలిసి సినిమా తీసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చుడాలిక.