ప్రస్తుతం కాలం మారేకొద్దీ మనిషి ఆలోచనల్లో రకరకాలుగా కొత్త రకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడైతే ఎక్కువగా తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్లనే పిల్లలు చేసుకునేవారు. అయితే రాను రాను అది తగ్గుతూ ఉండటంతో పాటు ప్రేమ పెళ్లిళ్లు మరింతగా పెరిగుతూ పోయాయి. ఇక ప్రస్తుత కాలంలో అయితే ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు అత్యధిక స్థాయిలో ఉంటున్నారు. ఇకపోతే పలు రంగాలకు చెందిన అనేకమంది ఈ విధంగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ముఖ్యంగా రంగుల ప్రపంచంగా చెప్పబడే సినిమా పరిశ్రమలో కూడా ఈ ప్రేమ పెళ్లిళ్లు ఇటీవల మరింతగా పెరిగాయి. అనేకమంది యువ నటులు, నటీమణులు ఈ విధమైన పెళ్లిళ్లకు మొగ్గుచూపుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఒక సూపర్ హిట్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ నటి ఒకరు, ఆ తరువాత నుండి వరుసగా మంచి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి హిట్స్ అందుకుంటూ ముందుకు సాగింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న ఆ నటి, కొన్నాళ్ల క్రితం ఒక యువ నటుడిని ప్రేమించి అతడికి బ్రేకప్ చెప్పి విడిపోయింది. ఆపై డ్యాన్సర్ కమ్ నటుడు అయిన మరొక వ్యక్తి తో పీకల్లోతుగా ప్రేమాయణం నడిపి, చివరిగా అతడి నుండి కూడా విడిపోవడం జరిగింది.
ఇక లేటెస్ట్ గా కొన్నాళ్లుగా ఒక యువ దర్శకుడితో రహస్య ప్రేమాయణం నడుపుతున్న సదరు నటి, అతి త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఇటీవల వార్తలు రావడం జరిగింది. అయితే కొద్ది రోజుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, మొదటి ఇద్దరు ప్రేమికుల మాదిరిగానే ఇతనికి కూడా ఆమె బ్రేకప్ చెప్పనుందని అంటున్నారు. అంటే ఆ ఇద్దరే కాకుండా ముచ్చటగా ఈ మూడు మూడవ వ్యక్తి ప్రేమ కూడా ముక్కచెక్కలు కానుందని, మరి సదరు హీరోయిన్ గారు ఎప్పటికి, ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఏమో చూడాలని కొందరు ప్రేక్షకులు ఆమెపై సోషల్ మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు....!!