తెలుగు తమిళ్లో మంచి క్రేజ్ అందు కున్న హీరో విజయ్ సేతుపతి ... సినిమా లకు మంచి డిమాండ్ ఉండటం తో పాటుగా .. యూత్ లో మంచి క్రేజ్ కూడా ఉంది. అయితే విలన్ గా , ప్రతి కథానాయకుడు గా ఎన్నో పాత్రలను పోషించిన విజయ్ ఇప్పుడు వరుస సినిమా లలో నటిస్తున్నాడు.. తెలుగు , తమిళ్ చిత్రా లకు సైన్ చేస్తున్నాడు.. అయితే ఆయనకు సంబంధించి న ఓ వార్త ఇప్పుడు సంచలనా లను సృష్టిస్తుంది.. 

 

 

 

 

 

 

అసలు విషయాని కొస్తే.. అఖిల భారత హిందూ మహాసభలు ఆగ్రహం వ్యక్తం చేశారు..అంత గా ఏం చేశాడు.. అనే విషయాని కొస్తే.. హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాల ను తప్పుబడుతూ ఓ టీవీ చానల్‌లో సినీ నటుడు విజయ్ సేతుపతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా, ఆయన వ్యాఖ్యల పై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

 

 

 

 

 

 

విజయ్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయన ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని నిలదీసింది. సొంత ప్రచారం కోసం హిందూ మతమే దొరికిందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా ఒక విషయం దొరికింది అంటే.. ఏదో అనుకోవచ్చు.. కానీ ఏకంగా హిందువుల మనోభావాలను దెబ్బ తీయడంతో ప్రస్తుతం ఆయన  పై సోషల్ మీడియా లు టార్గెట్ చేశాయి.. అంతేకాదండోయ్.. నెటిజన్లు కూడా విజయ్ సేతుపతిపై మండిపడుతున్నారు. ట్రోలింగ్, మీమ్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: