టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎనిమిదేళ్ళ క్రితం రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం, కలెక్షన్ గురించి ఎప్పటికీ కూడా ప్రేక్షకులు, పవన్ అభిమానులు మర్చిపోలేరనే చెప్పాలి. ఈ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ కూడా అందులోని పాటలు, డైలాగ్స్ ఎక్కడైనా వినపడితే చాలు, ప్రేక్షకుల వాటిని చూసేందుకు ఎగబడుతుంటారు అంటే ఆ సినిమా క్రేజ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 

 

ఇక ప్రస్తుతం వకీల్ సాబ్  సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్, దాని అనంతరం మరొకసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం కాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసినట్లు నిన్న సాయంత్రం హరీష్ శంకర్ ప్రకటించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా యొక్క అనౌన్సుమెంట్ వచ్చిన రోజునే దీనిపై పవన్ ఫ్యాన్స్ లో అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక దానికి తోడు గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన దేవిశ్రీ కూడా ఈ సినిమాకు తోడుకావటంతో, అంచనాలు తారాస్థాయికి చేరాయి. వాస్తవానికి గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ని అప్పట్లో హరీష్ శంకర్ తెరకెక్కించాల్సింది. 

 

అయితే అని కొన్ని అనివార్య కారణాల వల్ల అది మిస్ అయింది. ఇక అతి త్వరలో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కనున్న పవన్, హరీష్ శంకర్ సినిమా అనుకున్న మేరకు అంచనాలు రీచ్ అవుతుందో లేదో చూడాలని కొందరు అంటుంటే, తమకు ఏమాత్రం అనుమానం లేదని తప్పకుండా హరీష్ గారు ఈసారి తమ పవర్ స్టార్ కు గబ్బర్ సింగ్ ని మించే రేంజ్ లో మరింత గొప్ప విజయాన్ని అందించి తీరుతారని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా ఆ సినిమా అంచనాలు అందుకుంటే పవన్ ఫ్యాన్స్ కు అది పెద్ద పండగే మరి.....!!

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: