తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకూ వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లలో 'క్షణం' తప్పకుండా టాప్-5 సినిమాలలో ఉంటుంది. 2016 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ చిత్రం లో అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కథానాయకుడు అయిన రిషి(అడవి శేష్) ఫారిన్ దేశంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పని చేస్తుంటాడు. అయితే తన మాజీ లవర్ శ్వేత( ఆదా శర్మ) కూతురు తప్పిపోతే వెతకడానికి భారతదేశానికి వస్తాడు. ఆ తర్వాత శ్వేతా కుమార్తెను వెతికే క్రమంలో ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి.
తప్పిపోయిన చిన్నారి ఆచూకీ వెతికే క్రమంలో రిషి శ్వేతా ల మధ్య కొనసాగిన ప్రేమ సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించబడుతుంది. వీళ్లిద్దరి మధ్య ఘాటైన ప్రేమ చోటుచేసుకున్నట్టు డైరెక్టర్ చూపిస్తాడు. ఈ పార్టు అనేది సినిమాలోని మిస్సవకూడని సస్పెన్స్ ఎలిమెంట్ అని చెప్పవచ్చు. అపహరణకు గురైన తన ఎక్స్ లవర్ కూతురిని వెతికేందుకు రిషి ప్రయత్నిస్తుండగా బాబు ఖాన్( వెన్నెల కిషోర్) పరిచయమవుతాడు. సినిమాలో ఇతడి పాత్రకి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా సినిమాలు చూపించే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇతర పాత్రలతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సినిమా గడుస్తున్నకొద్దీ అన్ని సస్పెన్స్ త్రిల్లర్ ఎలిమెంట్స్ బయటపడుతుంటాయి.
సినిమాలో ఏ సన్నివేశం కొంచెం కూడా బోర్ కొట్టదు. ఈ క్రెడిట్ అంతా సినిమా రాసిన రచయిత(అడవి శేష్)ది అని చెప్పవచ్చు. అందుకే తెలుగులో వచ్చిన స్క్రీన్ ప్లే బేస్ డ్ సినిమాల్లో క్షణం మూవీ ఉత్తమమైనది అని సినీ విశ్లేషకులు, విమర్శకులు తేల్చి చెప్పేశారు. తక్కువ బడ్జెట్ తో, చిన్న చిన్న నటీనటులతో మంచి కథా బలం తో తెరకెక్కిన క్షణం మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా డబ్బులు వసూలు చేసింది. అడవి శేష్ గూడచారి సినిమా లో కూడా నటించి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ప్రస్తుతం అతను గూడచారి సీక్వెల్ కి స్క్రిప్టుని రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. ఏదేమైనా క్షణం మూవీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చుతుంది.