రంగస్థలం అనే సినిమా తెరకెక్కించిన బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం పేరుగల గ్రామంలో 1980 సంవత్సరంలో చోటు చేసుకున్న ఒక కథను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఈ కల్పిత సినిమాలో వినికిడిలోపం ఉన్న చిట్టిబాబు వ్యవసాయ పనులకు నీరు పెడుతుంటాడు. ఆ చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ నటించగా అతడి అన్నయ్య పాత్ర(కుమారబాబు)లో ఆది పినిశెట్టి నటించాడు. రాంచరణ్ సరసన సమంతా నటించగా... రంగస్థలం గ్రామానికి ప్రెసిడెంట్ పాత్ర అయిన ఫణీంద్ర భూపతి క్యారెక్టర్ లో జగపతిబాబు నటించాడు.
ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి రంగస్థలం గ్రామంలో ఉంటున్న రైతులకు పక్క గ్రామస్తులు ద్వారా అప్పులు ఇప్పించి ఎక్కువగా వడ్డీలతో అప్పు తీరవని వారి పొలాలను దోచేసుకుంటాడు. ఐతే రామలక్ష్మి(సమంత) తండ్రి తీసుకొన్న అప్పుకు రెట్టింపు డబ్బులు వసూలు చేసేందుకు ఫణీంద్ర భూపతి ప్లాన్ వేయగా... కుమార బాబు అతన్ని నిలదీస్తాడు. ఆ క్రమంలోనే ఫణీంద్ర భూపతి అనుచరుడు శేషునాయుడు కుమార్ బాబు తండ్రి అమ్మ గురించి తప్పుడు మాటలు మాట్లాడగా... అది తెలుసుకున్న చిట్టిబాబు శేషు నాయుడు ని చితకబాదుడు వస్తాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు అరెస్టు చేయడం, ఆపై ఎమ్మెల్యే దక్షిణామూర్తి( ప్రకాష్ రాజ్) చిట్టి బాబు ని విడిపించడం... పంచాయతీ ఎన్నికల్లో ఫణీంద్ర భూపతి పై పోటీ చేసేందుకు కూడా సహాయపడతాడు.
కానీ ఎన్నికలలో నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరిని ఫణీంద్ర భూపతి చంపేస్తాడు. ఈ క్రమంలోనే కుమారబాబు ని ఎవరో గుర్తు తెలియని ఆగంతకుడు గొంతుకోసి చంపేస్తాడు. ఆ పని కచ్చితంగా ఫణీంద్ర భూపతే చేసి ఉంటాడని భావించిన గ్రామస్తులు అతడి ఇంటిపై దాడి చేసేందుకు తరలివస్తారు. కానీ అప్పటికే ఫణీంద్ర భూపతి అక్కడినుండి పారిపోతాడు. ఎలాగోలా అతన్ని పట్టుకున్న చిట్టిబాబు తన సోదరుడిని చంపింది ఫణీంద్ర భూపతి కాదని తెలుస్తుంది. అతడిని ఎవరు చంపారు అన్నది ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ కాగా... అదే చివరి లో చాలా బ్రిలియంట్ గా తెలియచేస్తాడు దర్శకుడు సుకుమార్.
ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో చూపించిన ఇల్లులు, ఆఫీసులో ప్రతి ఒక్కటి సెట్స్ తో నిర్మించగా... పాత్రలలో నటించిన ప్రతి ఒక్కరూ మాసిపోయిన దుస్తులను ధరించగా నిజంగానే 1980లో రంగస్థలం అనే గ్రామం లోని ప్రజల జీవితాలను చూస్తున్నట్టుగా అనిపించింది. వినికిడి సమస్యతో బాధపడుతున్నా చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఈ చిత్రం అందరి మనసులను నేరుగా తాకిందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తూ ఒక మంచి సినిమా చూశాను రా అని గర్వంగా కచ్చితంగా ఫీలవుతారు.
ఈ సినిమా చూసే కొద్దీ ఇందులోని కొన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా మొదటి సన్నివేశంలో చిట్టిబాబు పాముని చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ పాము పై ఒక చార కూడా ఉంటుంది. అలాంటి చార ఫణీంద్ర భూపతి వీపు పైన ఉంటుంది. మొదటి సన్నివేశంలో పాము విడిచిన పొర(కుబుసం) ని చూసే పాము ఎక్కడుందో కనిపెడతాడు చిట్టిబాబు. అలాగే చివరి సన్నివేశంలో ఫణీంద్ర భూపతి బట్టలను గమనించి అతని పాముని కొట్టినట్టు కర్రతో కొట్టి చంపుతాడు. కుమార్ బాబు ఎక్కడైతే ఎంట్రీ అవుతాడో అదే ప్లేస్ లో చనిపోతాడు కూడా.
ఈ సన్నివేశంలో కుమార్ బాబు హత్యకు గురయ్యే ముందు కళ్ళజోడు పెట్టుకుంటాడు. కళ్ళజోడు పెట్టుకోకపోతే తనని ఎవరి చంపాడో గుర్తుపెట్టుకో లేదు కదా అనేసి సుకుమార్ ఈ చిన్న సన్నివేశం గురించి కూడా సినిమాలో తెలియజేశాడు. చిట్టిబాబు పెద్దల కదలికలను బట్టి ఇది ఇతరులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోగలడని ముందుగానే ప్రేక్షకులకు సుకుమార్ తెలియజేస్తాడు. రేడియోలో సమయం తెలియజేయడం. కుమారబాబు ని ప్లాన్ ప్రకారం చంపడం లాంటివి ఈ సినిమాలో ఏ తప్పు లేకుండా చాలా చక్కగా చూపించాడు సుకుమార్. ఎటువంటి సినిమాలు మరిన్ని రావాలని ప్రేక్షకులు ఇప్పటికే కోరుకుంటున్నారు.