వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్ల సంఖ్యలో అభిమానులను జూనియర్ ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. తాత నందమూరి తారకరామారావు వారసత్వంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీయార్ తనదైన ప్రతిభతో తాతకు తగ్గ మనవడిగా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ మొదట్లోనే స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి సక్సెస్ లతో స్టార్ స్టేటస్ అందుకున్న ఎన్టీఆర్ సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్లారు. 
 
అద్భుతమైన నటన, అదిరిపోయే డ్యాన్సులతో ఎన్టీయార్ సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. ఎలాంటి పాత్రలోనైనా అభినయించి మెప్పించడం ఎన్టీఆర్ కే సాధ్యం. జూనియర్ ఎన్టీయార్ సినిమాల్లో కొన్ని ఫ్లాప్ అయి ఉండవచ్చు. కానీ నటుడిగా ఎన్టీయార్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ కాలేదు. బ్రహ్మర్షి విశ్వామిత్రలో చిన్న పాత్రతో కెరీర్ మొదలుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదురుతూ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 
 
జూనియర్ ఎన్టీయార్ కు సినిమాలంటే ప్రాణం. రాఖీ సినిమా సమయంలో లావుగా ఉన్న ఎన్టీయార్ యమదొంగ సినిమా కోసం ఏకంగా 30 కిలోలు తగ్గారు. లైపో సెక్షన్ సర్జరీ చేయించుకుని ఎన్టీఆర్ బరువు తగ్గాడు. ఇప్పుడైతే వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి కానీ 14 సంవత్సరాల క్రితం లైపో చాలా ప్రమాదకరమైన సర్జరీ. కానీ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణాలనే పణంగా పెట్టాడు. 
 
ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ను అందరూ నిర్మాతల హీరో అంటారు. ఎలాంటి డైలాగ్ అయినా, డ్యాన్స్ మూమెంట్ అయినా సింగిల్ టేక్ లో పర్ఫెక్ట్ గా గా చేయడం ఎన్టీఆర్ కే సాధ్యం. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఎన్టీఆర్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. బృందావనం సినిమా తరువాత వరుస అపజయాలతో కొంతకాలం ఇబ్బంది పడిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి సినిమా సినిమాకు క్రేజ్ ను, మార్కెట్ ను పెంచుకుంటూ అభిమానులకు మరింత చేరువయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: