విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఆయన సినిమాలంటే కుర్రకారు పడిచచ్చిపోతారు. విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ.. టాకింగ్ స్టైల్ కు మంత్రముగ్దులవుతాయి. ఆయన టాకింగ్ స్టైలే కాదు... ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ను కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ మరో రూట్ ఎంచుకున్నాడు. 

 

విజయ్ దేవరకొండ చాలా స్ట్రాటజిక్ గా ఉంటాడు. మార్కెట్ కు తగ్గట్టుగా తనను తాను అప్ డేట్ చేసుకుంటాడు. అందుకే ఈ రౌడీ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ తో ఆడియన్స్ లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఎంటర్ టైన్ మెంట్ కు కొత్త దారులు వెత్తుక్కుంటున్నాడు. అందుకే విజయ్ దేవరకొండ కూడా రూటు మార్చుతున్నాడు. డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వెళ్తున్నాడు ఈ ఫైటర్. 

 


విజయ్ దేవరకొండ మార్కెట్ ను ఫాలో అవడంలో చాలా ముందుంటాడు. సినిమాల విషయంలో ఎంత క్యాలిక్యులేటెడ్ ఉంటాడో.. బిజినెస్ గురించి కూడా అంతే ఆలోచిస్తాడు. అందుకే యాక్టింగ్ తో పాటు రౌడీ బ్రాండ్ వేర్ ని స్టార్ట్ చేశాడు. 

 


విజయ్ దేవరకొండ సినిమా  బిజినెస్ లోనూ అడుగుపెట్టాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి నిర్మాతగా మారాడు. పెళ్లిచూపులుతో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి మకు మాత్రమే చెప్తా అనే సినిమా తీశాడు విజయ్. 

 

విజయ్ దేవరకొండ తర్వాత వెబ్ సిరీస్ లు నిర్మిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దొరసాని ఫేమ్ కె.వి.ఆర్. మహేంద్ర డైరెక్షన్ లో ఓ వెబ్ సిరీస్ తీస్తాడనే టాక్ వస్తోంది. లాక్ డౌన్ లో జనాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు అలవాటు పడ్డారు. కొత్త కంటెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో డిజిటల్ స్ట్రీమింగ్ మరింత విస్తృతమవుతుందని మార్కెట్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. అందుకే విజయ్ కూడా ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి వెబ్ సిరీస్ లు నిర్మిస్తాడనే ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: