ప్రభాస్ సినిమాల గురించి.. వాటి కలెక్షన్ల గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో.. అతని పెళ్లి గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు సినీజనాలు. ప్రభాస్హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఫలానా ఫ్యామిలీ అమ్మాయికి రింగ్ తొడగబోతున్నాడని చాలా వార్తలొచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా ఫ్యామిలీ లైఫ్ గురించి ఎలాంటి ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. సినిమాలతోనే గడుపుతున్నాడు. 


టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ప్రభాస్. బ్యాచిలర్ లైఫ్ లో సల్మాన్ ఖాన్ కు పోటీ ఇస్తోన్న ఈ హీరో ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేస్తాడా అని సినీజనాలంతా ఎదురుచూస్తున్నారు. బోల్డంత ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ డార్లింగ్ లైఫ్ లోకి రాబోయే అమ్మాయి ఎవరా అని టీటౌన్ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. 

 

ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్లుగా వార్తలొస్తున్నాయి. ఎరేంజ్ డ్ మ్యారేజ్ చేసుకుంటాడని.. పెదనాన్న కృష్ణం రాజు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనుష్కతో కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాడనే టాక్ వచ్చింది. అయితే ఇద్దరూ తాము బెస్ట్ ఫ్రెండ్స్, అంతకుమించి ఏం లేదని చెప్పి పెళ్లి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. 


ప్రభాస్ ఆల్ రెడీ ఫార్టీ క్రాస్ చేశాడు. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా ప్రమోషన్ కూడా అందుకున్నాడు. కానీ ప్రభాస్ ఇప్పటికీ పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్ నే ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. మరి భారీ సినిమాలతో కెరీర్ ను తర్వాతి లెవల్ కు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ హీరో కెరీర్ తో పాటు, పర్సనల్ లైఫ్ ను కూడా సీరియస్ గా తీసుకున్నప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఓ క్రేజీ ఎనౌన్స్ మెంట్ ని చూసే అవకాశం దక్కుతుంది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: