మహేష్ బాబు రియల్ హీరో. సినిమా ఇండస్ట్రీలో ఎవరికన్నా సహాయం అవసరమైతే మహేష్ బాబు వెంటనే తన హస్తాన్ని అందిస్తాడు. సినీ పరిశ్రమలో ముఖ్యంగా విలన్ క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో మహేష్ బాబుది ప్రత్యేకమైన శైలి. తాజాగా బాహుబలి సినిమాతో కిలి కిలి భాషలో ప్రేక్షకులను అలరించాడు కాలకేయ ప్రభాకర్. కాలకేయ ప్రభాకర్ మహేష్ మాబు యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ... తానూ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనను ప్రత్యేకంగా మహేష్ బాబు గారు గుర్తించారని చెప్పుకొచ్చాడు.
తన మొదటి సినిమా అతిధి.. క్లైమాక్స్ సీన్లో హీరోని తానూ కత్తితో దాడి చేసే సీన్ కోసం మహేష్ గారు నన్ను ప్రత్యేకంగా ఎన్నుకొని ఆ సీన్ తనతో చేయించాడని కాలకేయ ప్రభాకర్ కృతజ్ఞత పూర్వకంగా చెప్పాడు. ఆ సీన్ తరువాత తన లైఫ్ స్టైల్ మారింది. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు కారణం మహేష్ బాబుగారే అని తెలియజేసాడు. మహేష్ బాబు గురించి ఒక్క ప్రభాకర్ కాదు సరిలేరు నీకెవ్వరులో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ఫైటర్ రమణ పాత్రధారి కుమానన్ సేతురామన్ కూడా ఓ సందర్భాల్లో అయన యొక్క గొప్పతనాన్ని వివరించాడు.
సరిలేరు నీకెవ్వరూ ఫైట్ సీన్ లో కుమానన్ సేతురామన్ తన మొకాలుకి గాయం అవ్వడంతో తన పర్సనల్ మేనేజర్ ను వెంటవుంచి మరీ తనకు చికిత్స అందిస్తూ తన యోగక్షేమాలు రోజు అడిగి తెలుసుకునేవారని అయన తెలిపారు. మహేష్ గురించి చెప్పాలంటే ఈ రెండు కేవలం చిన్న మచ్చుతునకలు మాత్రమే అయితే గతంలో వెయ్యిమంది ఆడవారికి గుండె ఆపరేషన్స్ చేయించిన ఘనత ఆయనది. అయితే ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ వురి బాగోగులు చూశారు. అయితే ఓ సూపర్ స్టార్ రేంజ్ ఉన్న నటుడు ఇలా అందరి బాగోగులు పట్టించుకోవడం చాలా అరుదు అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.