వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలంటారు. అయితే ఈ మాట హీరోయిన్స్ కు వర్తించదు. వయసులో ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉండిపోతారు. వరుస ఆఫర్స్ వచ్చి పడేసరికి పెళ్లి అనే మాటే మర్చిపోతారు. మధ్యలో ఎప్పుడైనా గుర్తుకొచ్చినా.. ప్రొఫెషనలిజం పెళ్లిని డామినేట్ చేస్తోంది. వెనక్కి తిరిగి చూసుకునేసరికి 30ఏళ్లు నిండిపోతున్నాయి. 

 

పెళ్లి కావాల్సిన హీరోయిన్స్ అందరిలో పెద్దది అనుష్క. పెళ్లి ఎప్పుడని అడిగిన ప్రతీసారి త్వరలో అంటూ తప్పించుకుంటోంది. ఈ లోగా అతనితో పెళ్లి.. ఇతనితో పెళ్లి అంటూ చాలా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ లోగా ఒంటిమీదకు 38ఏళ్లు వచ్చిపడ్డాయి. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలకు అనుష్కే ఆప్షన్ అయిపోయింది. దీంతో ఒక దాన్ని మించిన పాత్రలు దక్కుతున్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించి గుడ్ బై చెప్పాలనుకుంటోంది అనుష్క.

 

త్రిష అందరి లాంటి అమ్మాయి కాదు. ప్రేమించు పెళ్లాడు టైటిల్ ను ఆదర్శంగా తీసుకొని.. బిజినెస్ మెన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. పెళ్లి తర్వాత నటించకూడదని ప్రియుడి ఫ్యామిలీ నుంచి ఒత్తిడి వచ్చేసరికి.. బ్రేకప్ చెప్పేసి.. మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. వరుసపెట్టి సినిమాలు ఓకే చేసేస్తున్న త్రిషను చూస్తోంటే.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. 37ఏళ్ల త్రిష పెళ్లి పీటలు ఎక్కుతుందో మరి. 

 

అందరిదీ ఒక ఫ్రాబ్రమ్ అయితే.. నయనతారది మరో ఫ్రాబ్లమ్. దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను ఐదేళ్లుగా ప్రేమిస్తున్నా.. పెళ్లి వార్తలను ఎంజాయ్ చేస్తోంది గానీ.. నోరు మెదపడం లేదు. నా పిల్లల తల్లి అంటూ.. నయనతార స్టిల్ విఘ్నేశ్ శివన్ పోస్ట్ చేయడంతో.. ఈ ఇద్దరి పెళ్లి ఎంతో దూరం లేదని తెలుస్తోంది. 

 

చందమామ కాజల్ కూడా.. 30ప్లస్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. వెండితెరపైకి వచ్చి 15ఏళ్లు అయినా.. ఇంకా మోజు తీరలేదు. చేయాల్సింది ఏదో ఉందనుకుంటూ పెళ్లీడును దాటేసింది. 34లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ మాత్రం.. పెళ్లిపై పెద్ద నమ్మకం లేకుండా.. కెరీర్ సాగించేస్తోంది. ఈ మధ్య ప్రేమను వెతుక్కొని బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం బుద్దిగా వరుస సినిమాలు చేస్తూ..కాస్త క్రేజ్ సంపాదించే పనిలో గడిపేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: