కేరళలో పుట్టిన జాస్మిన్ మేరీ జోసఫ్ సినిమాలో తెరంగేట్రం చేసిన తర్వాత మీరాజాస్మిన్ గా పేరు మార్చుకుంది. అమ్మాయి బాగుంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీరాజాస్మిన్ అందచందాలతో ఎంతగానో అలరించింది. బడా టాలీవుడ్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తో కూడా జతకట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గుడుంబా శంకర్ సినిమాలో ఈమె నటనకు గాను విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు. రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయి లా కనిపించిన మీరా జాస్మిన్ కుర్రకారు గుండెల్లో స్థానాన్ని ఏర్పరచుకుంది.
డిగ్రీ చదివే రోజుల్లోనే బ్లేస్సి అనే ఒక డైరెక్టర్ మీరా జాస్మిన్ అందచందాలను చూసి ఫిదా అయిపోయి తాను తీస్తున్న సూత్రధారన్ సినిమాలో నటింప చేశాడు. సినిమాల్లోకి రాకపోతే మీరాజాస్మిన్ డాక్టర్ అయ్యేది. ఈ సినిమా తర్వాత గ్రామఫోన్ అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2003వ సంవత్సరంలో మలయాళం సినిమా ఐన స్వప్నకూడు లో పృథ్వీరాజ్ సుకుమారన్, మీరాజాస్మిన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించగా... ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకు ఫుల్ క్రేజ్ లభించింది. కస్తూరి మాన్ సినిమాలో హాస్యాస్పదమైన ఎమోషనల్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ఫిలింఫేర్ అవార్డు తన సొంతం చేసుకొంది మీరా జాస్మిన్. కస్తూరి మాన్ సినిమా థియేటర్లలో వందరోజులు పైగా ఆడి రికార్డులు సృష్టించింది.
అదే సంవత్సరం పాదం ఒన్నూ విరులం లో ఆమె 15 ఏళ్ల ముస్లిం అమ్మాయిగా నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఒక వృద్ధుడిని వివాహం చేసుకోవలసి ఉండగా... మీరాజాస్మిన్ ఆ ఆ పాత్రలో చాలా సహజంగా నటించి అందరి మెప్పును పొందింది. అలాగే దీనికి ఆమెకు అనేక ఇతర అవార్డులతో పాటు రాష్ట్ర అవార్డు, జాతీయ అవార్డు లభించింది. తెలుగులో తమిళంలో కన్నడలో కూడా ఈమె చాలా అద్భుతంగా నటించి 2000-2010 సంవత్సరాలలో తిరుగులేని నటీమణిగా చలామణి అయ్యింది. 2014వ సంవత్సరంలో దుబాయ్కి చెందిన అనిల్ జాన్ టైటస్ అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.