బాలీవుడ్ లో బోల్డ్ ఇమేజ్ ఉన్న బ్యూటీస్ చాలా మంది ఉన్నారు. హాట్ హాట్ ఫోటో షూట్ లు, స్కిన్ షోతో సునామీలు తెప్పించిన లేడీస్ ఉన్నారు. కానీ వాళ్లెవరూ సన్నీలియోన్ ను టచ్ చేయలేకపోతున్నారు. యూత్ ఫాలోయింగ్ పెంచుకోలేకపోతున్నారు. దీంతో వీళ్లంతా సన్నీని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారట. ఈమెను వెనక్కి నెట్టడానికి ఏం చేయాలా అని ప్రయత్నిస్తారట. 

 

బిగ్ బాస్ షోతో ఇండియాకు వచ్చినప్పటి నుంచి రోజురోజుకీ సన్నీలియోన్ కు క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. సోషల్ మీడియా గురించి ఆన్ లైన్ సర్వే వరకు అన్నింటిలో సన్నీనే టాప్ లేపుతోంది. కొన్నేళ్ల నుంచి గూగుల్ లో మోస్ట్ సెర్చ్ డ్ ఇండియన్ సెలబ్రెటీగా హవా సాగిస్తోంది. ఇప్పుడు మోస్ట్ సెర్చ్ డ్ గ్లోబల్ స్టార్ గానూ నిలిచింది. ఇదే చాలామంది బోల్డ్ గర్ల్స్ కు అసూయపుట్టిస్తోంది. 

 

సన్నీలియోన్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మాగ్జిమమ్ ఐటమ్ సాంగ్స్ ఈమె అకౌంట్ లోకే వెళ్లిపోతున్నాయి. షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహాం లాంటి హీరోలు కూడా వాళ్ల 
సినిమాల్లో సన్నీకి అవకాశాలు ఇస్తున్నారు. దీంతో ఐటమ్ సాంగ్స్ ని నమ్ముకున్న బ్యూటీస్ కు బ్యాంక్ బ్యాలెన్సులు తరిగిపోతున్నాయి. సన్నీ కాల్షీట్స్ కు డిమాండ్ పెరిగిపోతోంది. 

 

సన్నీలియోన్ కు బాలీవుడ్ లోనే కాదు, సౌత్ లోనూ క్రేజ్ పెరిగిపోతోంది. ఈమె కాల్షీట్స్ కు భారీగా చెల్లించేందుకు కూడా నిర్మాతలు వెనుకాడటం లేదు. ఇక బోల్డ్ సినిమాలకు అయితే సన్నీనే బెస్ట్ ఆప్షన్ గా మారుతోంది. ఇదే చాలామంది బోల్డ్ బ్యూటీస్ కు జెలసీ తెప్పిస్తోంది. అందరూ సన్నీలియోన్ వెంట పడటానికి కారణమేంటని ఆరా తీస్తున్నారు. 

 

సన్నీలియోన్ కంటే ముందు.. సన్నీలియోన్ తర్వాత చాలామంది బోల్డ్ గర్ల్స్ వచ్చారు. స్కిన్ షో పేరు చెప్పి భయపెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ వాళ్లెవరూ సన్నీ ఇమేజ్ ను బీట్ చేయలేకపోతున్నారు.  ఈమె వైబ్రేషన్ ను తట్టుకొని, క్రేజీ ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. ఇదే వాళ్లను చాలా బాధపెడుతోంది. 

 

ఒకవైపు టాప్ లెస్ తో సంచలనం సృష్టించిన ఇషా గుప్తా.. మరోవైపు బికినీ స్టిల్స్ తో సోషల్ మీడియాని వేడెక్కించే ఉర్వశి రౌతేలా. వీళ్లకు తోడు అందమనే పదాన్ని భయపెట్టడమే పనిగా పెట్టుకున్న రాఖీ సావంత్, పూనమ్ పాండే లాంటి  వాళ్లు ఉన్నారు. కానీ వీళ్లెవరూ సన్నీలియోన్ ని రీచ్ అవ్వలేకపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: