నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 36వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా పలువురు ప్రేక్షకులు, అభిమానులతో పాటు ఎందరో సినిమా ప్రముఖులు సైతం ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలను పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక టాలీవుడ్ యువ నటుడు రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఎన్టీఆర్, దాని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఆ సినిమాని నిర్మించనున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ తో పనిచేసిన యువ దర్శకుడు బాబీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన మాటలు వింటే నిజంగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది.
ముందుగా జై లవకుశ సినిమా సమయంలో బాబీ మాట్లాడుతూ, సినిమా కథ మొత్తం విన్న ఎన్టీఆర్ గారు, సినిమాలోని కీలక పాత్రైన రవాణ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారని, ప్రతి ఒక్క సీన్ ని ఎంతో జాగ్రత్తగా నటించే అలవాటున్న ఎన్టీఆర్, పాత్రలో ఒకసారి దిగిన తరువాత దాని ఔట్ ఫుట్ కోసం ప్రాణం పెడతారని, తాను ఇప్పటివరకు చేసిన నటుల్లో బెస్ట్ నటుడు ఆయనే అంటూ బాబీ కితాబిచ్చారు. అలానే సెట్స్ లో అందరితో ఎంతో సరదాగా వ్యవహరించే ఎన్టీఆర్, ఎవరికైనా ఏదయినా సమస్య వస్తే చాలు అందరికంటే తానే ముందు ఉండి వారికి సాయం చేసి ధైర్యాన్ని కూడా చెప్తారని, అంతగొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ఎన్టీఆర్ అని కూడా చెప్పడం జరిగింది.
ఇక ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేసిన త్రివిక్రమ్, ఆ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, వాస్తవానికి ఎన్టీఆర్ తో సినిమా చేయడం అందరికంటే ఎంతో ఈజీ అని తనకు షూటింగ్ మొదలైన తరువాత తెలిసిందని, ఎంత పెద్ద సీన్ లేదా డైలాగ్ ని అయినా సరే ఒక్క టేక్ లో చేయగల బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ అని చెప్పిన త్రివిక్రమ్, ఆ సినిమాలోని బేర్ బాడీ తో ఉండే సీన్ కోసం పడ్డ శ్రమని మరొక హీరో ఎవరూ కూడా పడలేరని, ఎర్రటి ఎండలో ఎన్నో గంటలపాటు షర్ట్ లేకుండా నటించడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం అని ఆయన అన్నారు. ఇక తనవారితో ఎంతో కలిసిపోయే మనస్తత్వం ఉన్న ఎన్టీఆర్, వారికి ఏదైనా సమస్య వస్తే చాలు దానిని తనవంతుగా తీర్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తారని, అలానే ఆయనతో కూర్చుకుని సరదాగా మాట్లాడుతుంటే సమయం తెలియదని, అంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ఎన్టీఆర్ అని త్రివిక్రమ్ చెప్పడం జరిగింది....!!