దేశంలో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా వైరస్ మొదలైంది. మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలైంది.. అప్పటి నుంచి థియేలర్లు, మాల్స్ పూర్తిగా మూసివేశారు. షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.. దాంతో సినీ కార్మిలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ షూటింగ్స్ లో పాల్గొంటేనే ఆదాయవ వచ్చే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే టాలీవుడ్ సినీ కార్మికులకు ఇండస్ట్రీ నుంచి సహాయం అందిస్తున్నా.. అది పూర్తి స్థాయిలో నడిపించడం కష్టమైన పనే.. తాజాాగా కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన చిత్ర పరిశ్రమను తిరిగి ఎలా గాడిలో పెట్టాలన్న అంశంపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చిరంజీవి మాట్లాడారు. భేటీ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... షూటింగులు ఎప్పటి నుంచి ప్రారంభం కావాలనే విషయంపై ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రావాలి అనే దానిపై సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రభుత్వం అన్ని రంగాలకు లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తోందని అన్నారు. అయితే, సినీ రంగం భవిష్యత్తు ఏమిటనే సందేహం అందరిలో ఉందని చెప్పారు. కరోనా వ్యాప్తికి కారణం కాకూడదనే భావనతో, ప్రభుత్వ సహకారంతో షూటింగులు చేసుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. ఇప్పటికే సినీ కార్మికులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని వారి కష్టాన్ని గుర్తించాలని విన్నవించారు మెగాస్టార్. షూటింగులు జరిగితే కానీ బతుకులు ముందుకు సాగని 14 వేల మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న విన్నపమని చెప్పారు.
కనుక దయచేసి 14 వేల మందిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, రాజమౌళి, సి.కల్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి వచ్చారు. ఈ చర్చల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ, సినిమా థియేటర్లను తిరిగి తెరిచే అంశాలపై కొంత స్పష్టత వస్తుందని సమాచారం.