హీరో రానా ఇటీవల సోషల్ మీడియా వేదికగా చేసుకొని మిహీక బజాజ్ తన ప్రేమను అంగీకరించింది అంటూ తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వీరి ప్రేమ ప్రయాణానికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారం తెలియజేయడం జరిగింది. అలాగే ఇటీవల వీరి పెళ్లి విషయంపై రామానాయుడు స్టూడియోలో ఇరువురి కుటుంబ సభ్యులు హాజరు అయ్యి పెళ్లి విషయాలు మాట్లాడుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అతి త్వరలోనే రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ తరుణంలో రానా తన ప్రేమాయణం పై ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. మిహిక తన బాబాయ్ దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత క్లాస్ మెట్ అని తెలియజేశాడు రానా. లాక్ డౌన్ ముందు మా ప్రేమ ఫలించింది అని రానా తెలియజేశారు. నిజానికి మా ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉంది.
ఆమె నా జీవిత భాగస్వామీగా పర్ఫెక్ట్ అని అనిపించింది. అలాగే మిహీక మంచి పనులు జరుగుతున్నప్పుడు ఎక్కువగా లెక్క నువ్వు వేయకూడదు అని అనిపించి తనతో కలిసి నా ప్రేమను నీకు వ్యక్తం చేశాను అని రానా తెలియజేశాడు. అంతేకాకుండా నా జీవితాంతం తనతోనే నేను సంతోషంగా ఉండగలను అనే నమ్మకం కలిగింది అంటూ మిహీక గురించి తెలియజేశాడు. ఇక రానా కలిసి మనము పెళ్లి చేసుకుందాము అని అడగగానే షాక్ లోనే ఓకే తెలియజేసింది. నిజానికి మా ప్రేమ ప్రయాణంలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా సింపుల్గా ముందుకు కొనసాగింది అని తెలియజేశారు.
మా ఇద్దరి ప్రేమ ప్రయాణం గురించి ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేస్తే ముందుగా ఆశ్చర్యపోయారు. కానీ ప్రస్తుతానికి మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నారు అని సంతోష పడుతున్నారు. నిజానికి నా పెళ్లి గురించి తల్లిదండ్రులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు అని రానా తేలియచేశాడు. ఇక మిహిక హైదరాబాద్ అమ్మాయి.. తను బంజారాహిల్స్ లో ఉంటుంది అని తెలియజేశాడు. తనకు తెలుగు సరిగ్గా రాదు అని చెప్పుకొని వచ్చాడు రానా. అంతే కాకుండా మా ఇద్దరికీ ముంబైలో కూడా ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు అని తెలిపాడు. అలాగే స్నేహితులుకు మా ప్రేమ గురించి తెలుసుకున్న తర్వాత అందరూ సంతోషపడ్డారు అని అభిమానులతో రానా తేలియచేశాడు.