మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి అశేషమైన అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఏకైక హీరోగా ఎదిగాడు. అతని గొంతు చాలా పురుషాహంకృతంగా ఉంటుందని అభిమానులు అంటున్నారు. అలాగే తన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో అందానికి అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఘట్టమనేని మహేష్ బాబు 1975 ఆగస్టు 9న సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి లకు చెన్నైలో జన్మించాడు. నీడ సినిమాలో తొలిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు వేసవికాలం సెలవులలో కృష్ణ సినిమాలలో మహేష్ బాబు నటించేవాడు. పోరాటం సినిమా లో హీరో కృష్ణ కి తమ్ముడి పాత్రలో నటించిన మహేష్ బాబు కు మంచి గుర్తింపు దక్కింది. అన్నయ్య రమేష్, తండ్రి కృష్ణ లకు బజార్ రౌడీ సినిమాలో తమ్ముడు గా మహేష్ బాబు నటించాడు. 

IHG


కొడుకు దిద్దిన కాపురం సినిమా లో డ్యూయల్ రోల్లో మహేష్ చాలా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించి బాలనటుడి కెరీర్ కి స్వస్తి చెప్పి లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. 1999వ సంవత్సరంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు చిత్రంలో తొలిసారిగా కథానాయకుడి పాత్రలో నటించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు. ఆ తర్వాత వచ్చిన వంశీ రాజకుమారి చిత్రాలు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్ సినిమాలుగా నిలిచి అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. 

 

IHG


లేకపోతే ప్రస్తుతం హైదరాబాదులో తన ఇద్దరు పిల్లలకు భార్యతో కలసి నివాసం ఉంటున్నాడు. భారత దేశ వ్యాప్తంగా రెండు నెలల పాటు లాక్డౌన్ ప్రకటించడంతో ఇంటికే పరిమితమైన మహేష్ బాబు తన కుటుంబంతో జాలిగా సమయాన్ని గడిపి ఆ దృశ్యాలను నెట్టింట షేర్ చేసి తన అభిమానులను బాగా అలరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: