కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులన్నీ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఇళ్లకే పరిమితమైన హీరోయిన్లు మాత్రం.. సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. వారిలో బోల్డ్ బ్యూటీ పూజా హెగ్డే హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. దాంతో పూజా ఫ్యాన్స్ క్లీన్ బోల్డ్ అవుతున్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దాంతో స్టార్ హీరోలు, హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే హీరోయిన్లు మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు తమను ఆడియన్స్ ఎక్కడ మరిచిపోతారోననే.. భయంతో లైమ్ టైమ్ లో ఉండేందుకు బోల్డ్ స్టేట్ మెంట్స్, హాట్ ఫోటోస్ ను షేర్ చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే కూడా తన హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తోంది.
లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ మిస్ అవుతున్న పూజా.. ఇప్పటికే సెల్పీలు, వివిధ సెట్స్ లో పలు సందర్భాల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా పెళ్లికూతురి గెటప్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బుట్టబొమ్మ చేతికి మెహిందీ పెట్టుకొని చాలా హాట్ గా దర్శనమిచ్చింది. తాను నటించిన హౌస్ ఫుల్ 4 చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ను ఈ సందర్భంగా పోస్ట్ చేసింది. హౌస్ ఫుల్4చిత్రానికి సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం, సంగీత్ డ్రెస్ లో ఇలా అంటూ గత అనుభవాలను పంచుకుంది. ఆ ఫోటోలను చూసిన పూజా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
పూజాలాగే చాలామంది ముద్దుగుమ్మలు.. షూటింగ్స్ మిస్ అవుతున్న వేళ.. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇకపోతే.. వరుస అవకాశాలతో ఫుల్ జోష్ మీదున్న పూజా.. ఈ ఏడాది ఆరంభంలోనే అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్.. అల వైకుంఠపురం చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఈ హాట్ బ్యూటీ ఖాతాలో మరిన్ని సినిమాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా కథానాయికగా నటిస్తోంది. అలాగే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనూ కనిపించనుంది. త్వరలోనే దుల్కర్ సల్మాన్ తో జతకట్టనున్నట్టు సమాచారం.