హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అందుకొని పూనమ్ కౌర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా పాపులర్ అయ్యింది. జల్సా సినిమాలో ముందు ఈమెను హీరోయిన్ గా అనుకుని కొంత భాగం షూట్ చేసి ఆ తర్వాత ఎందుకో ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ ను తీసుకున్నారు. ఆ టైం లోనే ఆమె డిప్రెషన్ లోకి వెళ్లడం హాస్పిటల్ ఖర్చు గట్రా పవన్ కళ్యాణ్ కట్టడం లాంటివి నానా రచ్చ చేశాయి. ఇదిలాఉంటే పవన్ గురించి ఒక్కోసారి ఒక్కోలా స్పందించే పూనమ్ కౌర్ లేటెస్ట్ గా ఈ కరోనా టైం లో పీకే లవ్ మాస్క్ తో షాక్ ఇచ్చింది. కరోనా నుండి తమని తాము కాపాడుకోవాలంటే మాస్క్ కంపల్సరీగా ధరించాలి అంటూ అందరు చెబుతున్నారు. 


అందుకే వెరైటీ మాస్కులు మార్కెట్ లోకి వస్తున్నాయి. తెలంగాణా మంత్రి కేటీఆర్ చేనేత ఉత్పత్తుల రంగు రంగుల మాస్క్ లను వాడుతున్నారు. ఇదిలాఉంటే పూనమ్ కౌర్ పీకే లవ్ మాస్క్ తో కనిపించి షాక్ ఇచ్చింది. పీకే లవ్ అంటే అర్ధం ఏంటి.. పవన్ కళ్యాన్ లవ్ అని అందరు అనుకోవడం గ్యారెంటీ కానీ ఇక్కడ విశేషం ఏంటంటే తన అభిమాని ఒకరు పూనమ్ కౌర్ మీద ప్రేమతో పీకే అంటే పూనమ్ కౌర్ కు షార్ట్ ఫామ్ లో పీకే లవ్ అని మాస్క్ పంపించాడు. దాన్ని అమ్మడు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సడెన్ గా పీకే లవ్ మాస్క్ తో కనిపించిన పూనమ్ కౌర్ ను చూసి మళ్ళీ పవన్ మీద పూనమ్ కు అభిమానం పుట్టుకొచ్చిందా అనుకున్నారు. 


సినీ కెరియర్ దాదాపు ముగిసినా ఇలా ఏదో ఒకవిధంగా వార్తల్లో ఉండటం ఆమెకు అలవాటు అయ్యింది. ఆమధ్య సీరియల్స్ లో కనిపించిన పూనమ్ ఇప్పటికి సరైన ఛాన్స్ రావాలే కానీ తన సత్తా చాటుతా అంటుంది. మరి ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: