తెలుగు హీరోయిన్ లు అవకాశాల్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా సరే వారికి తెలుగులో మాత్రం అవకాశాలు అనేవి పెద్దగా రావడం లేదు అనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగులో నుంచి వచ్చిన హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉండేది. కాని మన తెలుగులో ఇప్పుడు ఎక్కువగా పరభాషా హీరోయిన్ లకే ప్రాధాన్యత అనేది దర్శక నిర్మాతలు ఇవ్వడం ఈ మధ్య  కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. తెలుగు అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ చేసే విష‌యంలోనూ... గ్లామ‌ర్ ప‌రంగా ఓవ‌ర్ డోస్ ఇచ్చే విష‌యంలోనూ కాస్త వెన‌కా ముందు ఆలోచిస్తుంటారు. అంతెందుకు ఎంతో టాలెంట్ ఉన్న అంజ‌లి, ఈషా రెబ్బా లాంటి వాళ్ల‌కు వాళ్ల స్థాయితో పోలిస్తే స‌రైన అవ‌కాశాలు రాలేద‌నే చెప్పాలి.

 

అయితే లాక్ డౌన్ లో సమయంలో మన తెలుగు హీరోయిన్ లకు బాగా కలిసి వచ్చింది అనేది టాలీవుడ్ జనాల మాట. అవును ఇప్పుడు లాక్ డౌన్ లో మన తెలుగు హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు తక్కువ రేట్ కు సినిమాలు చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో దర్శక నిర్మాతలు వారి వెంట పడుతున్నారని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భారీ రెమ్యున‌రేష‌న్లు ఇచ్చి బాలీవుడ్‌, నార్త్ హీరోయిన్ల‌ను తీసుకు వ‌చ్చేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. హీరోలు త‌క్కువ రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటామ‌ని దిగి వ‌స్తున్నారు.

 

దీంతో హీరోయిన్ల‌కు భారీ రెమ్యున‌రేష‌న్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు ఒక ఇద్దరు హీరోయిన్ లకు మన తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని సమాచారం. స్టార్ హీరోల సినిమాల్లోనే వారిని తీసుకుంటున్నారు అని వారికి మంచి పాత్రలు ఇస్తున్నారు అని... ఆ సినిమాలు హిట్ అయితే మాత్రం భవిష్యత్తులో కూడా వారిని సినిమాల్లోకి తీసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి వాళ్ళ అదృష్టం ఏ స్థాయిలో ఉందో చూడాలి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: