చాలామంది సినిమా ప్రముఖులు చిరంజీవి మెగాస్టార్ ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసిస్ చారిటీ సంస్థ ద్వారా రోజువారి సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రముఖ హీరోలు అయిన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వారితో పాటు సినీ నిర్మాతలు, దర్శకులు తదితరులు లక్షల, కోట్ల రూపాయల విరాళాలు అందజేశారు. సీసీసీ సభ్యులు ఇప్పటికే ఈ విరాళాలతో వేలమంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఐతే తాజాగా మళ్లీ సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు సినీ ప్రముఖులందరూ చిరంజీవి ఇంట్లో భేటీ కావాలనుకున్నారు. అలాగే లాక్ డౌన్ అనంతరం చిత్ర షూటింగులు పునఃప్రారంభించడానికి మంత్రి తలసాని తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి తనని పిలవలేదని బాలకృష్ణ మండిపడ్డారు. తలసాని తో కలిసి భూములు పంచుకుంటున్నారు ఏమో అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా... అతని వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్ని రేపాయి.
ఈ క్రమంలోనే సీసీసీ ఫౌండేషన్ లో సభ్యుడైన తమ్మారెడ్డి భరద్వాజ్ ని ఓ విలేకరు ఇలా అడిగాడు... సార్, సీసీసీ లో పెద్ద స్కాం జరిగిందంట కదా నిజమేనా? అని ప్రశ్నించగా... తమ్మారెడ్డి భరద్వాజ్ సమాధానమిస్తూ... అవును పెద్ద స్కామ్ జరిగింది. మేమందరం కలిసి డబ్బులు పంచుకున్నాం. డబ్బులను సమానంగా నొక్కేయాడానికే నిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఎక్కువ వాటా ఎవరికి రావాలనే దానిపై చర్చించాం', అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.
పంచుకున్నామని ఆరోపణలు చేయడానికైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. పొట్టకూటి కోసం కష్టపడే వారికి నిత్యావసర సరుకులు సమకూర్చాలనే ఉద్దేశంతో సీసీసీని ఏర్పాటు చేశామని తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు. చిరంజీవి ఇంట్లో గత 20 ఏళ్లుగా చాలా మీటింగ్లు పెడుతూనే ఉన్నాం. ఈరోజు ఏం మొదటిసారి కాదు. నిజానికి చిరంజీవి ఇంట్లో ఇప్పుడు పెట్టిన సమావేశం ఇండస్ట్రీ గురించి కాదు. సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు చిరంజీవి వెళ్లారు. చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీ మీటింగ్ పెట్టలేదు... దాని గురించి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.