వరుస ఫ్లాపులతో ఉన్న నానికి 'జెర్సీ' సినిమాతో అదిరిపోయే హిట్ ఇచ్చాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ‘జెర్సీ’ సినిమా గత ఏడాది సమ్మర్ నేపథ్యంలో వచ్చి నాని కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పోయింది. క్రికెట్ గేమ్ నే సెంట్రల్ పాయింట్ గా తీసుకుని డైరెక్టర్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సినిమాలో ఇంటర్నల్ ఎమోషన్స్ అదేవిధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ బలంగా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా... ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 'జెర్సీ' డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల రామ్ చరణ్ కి లాక్ డౌన్ టైం లో గౌతమ్ తిన్ననూరి స్టొరీ వినిపించాడట. స్టోరీ విన్న రామ్ చరణ్ అదిరిపోయింది అని కలిసి కన్ఫామ్ గా చేద్దామని మాట ఇచ్చినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రామ్ చరణ్ కెరీర్ లో గుర్తిండిపోయే క్యారెక్టర్ డిజైన్ గౌతమ్ తిన్ననూరి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ‘RRR’ తర్వాత కుదిరితే రామ్ చరణ్ సందీప్ రెడ్డి తో గాని లేకపోతే వెంటనే గౌతమ్ తిన్ననూరి సినిమా గానీ చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రామ్ చరణ్ ఫోకస్ మొత్తం ‘RRR’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని దానిపైనే ఉందట. లాక్ డౌన్ కారణంగా ఉన్న కొద్దీ కెరియర్ లో గ్యాప్ వస్తున్న నేపథ్యంలో రాజమౌళి ప్రాజెక్ట్ అయిన వెంటనే నెక్స్ట్ ప్రాజెక్టులన్నీ అతి తక్కువ టైమ్ లోనే చెర్రీ కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.