సెలబ్రెటీలు అంటే జనాలకు చాలా ప్రత్యేకత ఉంది.. అంతేకాదు వారి ప్రోఫిషన్ పరంగా ఎంత ఫేమస్ అవుతున్నారో అంతకు మించిన రేంజులో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరేమో పూర్తిగా తమ జీవితాలను పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు.ప్రముఖ మోడల్, పబ్ టెండర్ జెస్సికా లాల్ హంతకుడు మనుశర్మకు గొప్ప ఊరట లభించింది. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ అలియాస్‌ సిద్ధార్థ్‌‌ వశిష్ట.. తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. సెంటెన్స్‌ రివ్యూ బోర్డు సిఫార్సు మేరకు.. వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి ఇచ్చారు. దీంతో మను శర్మతో పాటు మరో 18 మంది విడుదలయ్యారు.

 

 

 

ఓ ప్రైవేట్ బార్‌లో పనిచేస్తున్న జెస్సికా లాల్‌ను 1999లో మను శర్మ అత్యంత దారుణంగా హత్య చేశాడు. సమయం మించిపోయిన కారణంగా మద్యం సర్వ్‌ చేయడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన మనుశర్మ ఆమెను పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు మను శర్మ మీద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.2006లో మనుశర్మ నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2010లో సుప్రీంకోర్టు.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పడంతో అతడిని తీహార్ జైలుకు తరలించారు. నాటి నుంచి అతడు అక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు.

 

 


అయితే ..ముందస్తుగా తనను విడుదల చేయాలంటూ రెండేళ్ల కిందట మను శర్మ చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. అత్యంత హేయమైన నేరం చేసిన మను శర్మకు ఆ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. అనేక పరిణామాల అనంతరం మను శర్మను విడుదల చేయాల్సిందిగా ఎస్సార్బీ సూచించింది. దీంతో అతడు మూడేళ్ల ముందుగానే జైలు నుంచి విడుదలయ్యాడు...అంతేకాకుండా అతను కొద్ది రోజులు వరకు సిటీ దాటి వెళ్లకూడదని చూసించారు. ఆ షరతు మీద అతన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: