టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే తనకు ఇష్టమైన క్రికెటర్ గురించి ప్రేక్షకులకు చెప్పుకొచ్చింది, మాములుగా క్రికెట్ అనగానే సచిన్, గంగూలీ, యువ రాజ్ ఇలాంటి వారు ఇష్టమని చెబుతుంటారు కానీ పూజాకి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ అంటే ఇష్టమని అంటుంది. ఈతరంలో ఎంతోమంది గొప్ప క్రికెటర్లు ఉంన్నా ద్రావిడ్ కు సరిలేరు అంటుంది. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని షూటింగ్ లో ఉన్నా సరే షాట్ మధ్యలో కనీసం స్కోర్ అయినా అడిగి తెలుసుకుంటానని అంటుంది పూజా హెగ్డే.
చాలా సందర్భాల్లో టాప్ ఆర్డర్ కుప్పకూలిపోగా ద్రావిడ్ ఒక్కడే నిలబడి గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి, అందుకే అతన్ని డి వాల్ అని కూడా పిలుస్తారు. ద్రావిడ్ అభిమానుల్లో పూజ హెగ్డే ఒకరు. ఈతరం క్రికెటర్స్ లో ధోని, రాహుల్ లను ఇష్టపడతా అంటుంది అమ్మడు. ఎంతమంది ప్రతిభావంతులు ఉన్నా సరే ద్రావిడ్ మిస్టర్ కూల్, క్లాసిక్ ప్లే తనని ఇంప్రెస్ చేస్తుందని చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ టైం లో పూర్తిగా ఇంట్లోనే ఉంటూ టైం పాస్ చేస్తున్న పూజా ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంది.
అందులో భాగంగానే ఫ్యాన్స్ పూజా హెగ్డేకి ఇష్టమైన క్రికెటర్ గురించి అడిగితే రాహుల్ ద్రావిడ్ జపం చేస్తూనే. ద్రావిడ్ హార్ట్ కోర్ ఫ్యాన్స్ లో పూజా హెగ్డే ఒకరు. ఒకవేళ ద్రావిడ్ ను కలవాల్సి వస్తే పూజా అక్కడ చిన్నపిల్లలా మారి తన అభిమాన క్రికెటర్ ను ముద్దులతో ముంచెత్తుతుందని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ తో ఒక సినిమా... అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాల్లో నటిస్తుంది పూజా హెగ్డే.