ఇంగ్లీష్ సినీ నిర్మాతలు హ్యారీ పాటర్, షెర్లాక్ హోమ్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను వెబ్ సిరీస్లలాగా రూపొందించి ప్రేక్షకులను బాగా అలరించారు. ఒక కథాంశం బాగుంటే దాన్ని కాస్త వివరంగా సీసన్స్, ఎపిసోడ్స్ రూపంలో ప్రేక్షకులకు అందించి ఎన్నో లాభాలను అర్జించారు దర్శక నిర్మాతలు. అయితే ఇదే ట్రెండ్ ని తెలుగులో కూడా అనుసరించాలని మహేష్బాబు అనుకుంటున్నారట. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ సినిమాలు, సన్ నెక్స్ట్, ఆహా లాంటి ప్లాట్ ఫామ్ లపై సినిమాలను చూడడానికి, అలాగే ఓటిటి ప్లాట్ ఫామ్ తమ సొంతంగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్లను, ఇతర వెబ్ సిరీస్ లను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. 


కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇంగ్లీషు వారు మాత్రమే వెబ్ సిరీస్ లను రూపొందించేవారు. కానీ డిజిటల్ లైఫ్ కి భారత దేశ ప్రజలు కూడా బాగా దగ్గర అవుతుండడంతో మొట్టమొదటిగా హిందీ వాళ్ళు వెబ్ సిరీస్ లు రూపొందించడం స్టార్ట్ చేశారు. కాలక్రమేణా ఆ ట్రెండ్ మన తెలుగు లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆహా ఓటీటీ సిన్(sin) అనే అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. అయితే ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు వెబ్ సిరీస్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాల నుండి బలంగా టాక్ వినిపిస్తోంది. సామాజిక విలువలు కలిగిన సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు గ్రామాలను దత్తత తీసుకొని పేద ప్రజలకు అండగా ఉంటాడు. ఈ చిత్రం మహేష్ బాబు అభిమానులకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్ర కథాంశం తో శ్రీమంతుడిని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కొంతమంది నిర్మాతలు దర్శకులు భావిస్తున్నారట. 


రెండు గంటల సినిమాలో అన్ని అంశాలను చూపించడం దాదాపు అసాధ్యం. అందుకే శ్రీమంతుడు సినిమా ఆల్రెడీ థియేటర్లలో, టీవీలో ప్రసారమయినప్పటికీ... మళ్లీ ఆ మంచి కథను తెలుగు ప్రేక్షకులకు చక్కగా చూపించాలని వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు మనం భావించవచ్చు. ఈ వెబ్ సిరీస్ లో మహేష్ బాబు నటిస్తారని సమాచారం. మహేష్ బాబు టాలీవుడ్ పరిశ్రమలో సూపర్ స్టార్ కాబట్టి తాను తీస్తున్న వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ వెబ్ సిరీస్ గురించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: