![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/hero-siddharatha-new-movie-title-second-innings5289315e-11c4-4274-a7dc-f5fc0a6760c4-415x250.jpg)
సౌత్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో సిద్ధార్థ. తెలుగు సినిమా రంగంలో బొమ్మరిల్లు సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సిద్ధార్థ ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ కావటంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తమిళ సినిమా రంగానికే పరిమితమైన సిద్ధార్థ అక్కడ హీరోగా మరో పక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. కాని చేస్తున్న సినిమాలు తమిళంలో కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్న తరుణంలో చాలా వరకు సిద్ధార్థ కి అవకాశాలు తగ్గిపోయాయి.
ఇదిలా ఉండగా తాజాగా తెలుగు సినిమా రంగంలోకి సరికొత్త గెటప్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో సిద్ధార్థ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు సమాచారం. పూర్తి మ్యాటర్ లోకి వెళితే ఆర్ఎక్స్100 సినిమా తో మంచి పాపులారిటీ దక్కించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో హీరో సిద్ధార్థ సినిమా చేయనున్నట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. 'మహా సముద్రం' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చేయడానికి డైరెక్టర్ అజయ్ భూపతి మొదట రవితేజ ని కలవడం జరిగింది, ఆ తరువాత నాగ చైతన్య తో సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ ని ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ బ్యాగ్డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం తెరకెక్కనుందని సమాచారం. చాలా కాలం తర్వాత సిద్ధార్థ మళ్లీ తెలుగులో సినిమా చేయడానికి హీరోగా అవకాశాలు లేకపోవడంతో నెగిటివ్ షేడ్స్ పాత్రైనా ఓకే అన్నట్లు దాంతో ఈ సినిమాలో సిద్ధార్థ ఫిక్సైనట్లు టాక్.