హీరోయిన్లపై రకరకాల గాసిప్స్ రావడం కామన్. స్పెషల్లీ వాళ్ల ప్రేమ వ్యవహారాల గురించి ఏ చిన్న లీక్ అయినా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఓ హీరోయిన్ తన ప్రేమ వ్యవహారం గురించి తానే చెప్పుకుంటోంది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకోబోనని కండిషన్ పెడుతోంది. హీరోయిన్ల ప్రేమ కథలంటే ఫ్యాన్స్కి అంతకంటే ఇంట్రస్టింగ్ టాపిక్ ఏమీ ఉండదు.. మొన్నా మధ్య కాజల్ ప్రేమలో పడిందంటూ ఫోటోలతో సహా మీడియాలో రావడంతో ఇండస్ట్రీ దృష్టి అంతా అటే మళ్లింది… ఆతర్వాత అలాంటిదేం లేదంటూ కాజల్ కొట్టిపారేసింది… దీంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. పెళ్లైన కొత్తలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ప్రియమణి. ఆ సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్న ఈ బ్లాక్ బ్యూటీ కి లవర్ దొరికేశాడట. టాలీవుడ్ ని షేక్ చేసి ప్రస్తుతం కన్నడలో సినిమా చేస్తున్న ప్రియమణి ప్రేమ విషయంలోనూ కొంతకాలంగా రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.. ప్రియమణి ప్రేమలో పడిందంటూ వార్తలు వచ్చాయి… ప్రస్తుతం ఈ బ్లాక్ బ్యూటీ కన్నడ సినిమా చేస్తోంది… దీంతో ఈ అమ్మడి ప్రేమ్ కహానీ గురించి శాండల్ వుడ్ నెలరోజులుగా కోడై కూస్తోంది.. తన ప్రేమ గురించి వస్తున్న వార్తలపై ప్రియమణి స్పందించింది.. తాను ప్రేమలో ఉన్నానని చెప్పేసింది. ఎపిహెరాల్డ్. కామ్ కి అందిన సమాచారం ప్రకారం తాను ప్రేమిస్తున్నది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని కూడా ప్రకటించింది ఈ కేరళ కుట్టి.. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. పెళ్లికి ఇంకా టైముందని అంటోంది.. ఒకరికొకరు బాగా అర్ధం చేసుకున్నాకే మూడు ముళ్లు వేయించుకుంటానంటోందీ బ్లాక్ బ్యూటీ. ప్రియమణి ప్రస్తుతం ఆర్పీ పట్నాయక్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా పూర్తికావచ్చింది. ఈ మూవీలో సీబీఐ ఆఫీసర్గా కనిపించబోతోందీ ముద్దుగుమ్మ. కన్నడలోకి ఎంట్రీ ఇచ్చాక బాగా బిజీ అవుతోంది ప్రియమణి. ప్రస్తుతం మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పేసిందీ భామ. అటు సినిమాలు… ఇటు లవ్ స్టోరీలతో టాక్ ఆఫ్ ది శాండల్ వుడ్గా మారింది ప్రియమణి. ప్రియమణి లవ్ లో పడిందన్న వార్తలపై మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: