థియేటర్ లో సినిమా చూడడం అన్నది అందమైన కల. అది ఒక మధురానుభూతి కూడా. ఒకేసారి విభిన్నమైన వ్యక్తులతో  కలసి కూర్చుని సినిమాలోని భావోద్వేగాలను ఆస్వాదించడం అంటే అది గొప్ప ఫీల్. అయితే ఒక తరం అభిరుచులు మరో తరంలో నచ్చవు. ఇక సినిమా ధియేటర్లు తీసుకుంటే గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే ఆక్యుపెన్సీ రేటు దారుణంగా పడిపోతూ వస్తోంది.

IHG

దానికి కారణాలు అనేకం. సినిమా ఇపుడు ఏకైక  వినోదం కాదు. ఇక సినిమా హాళ్ళోనే టికెట్ పెట్టి సినిమా చూడడం ఒక్కటే మార్గం కాదు. గత పదేళ్ళుగా చూసుకుంటే స్మార్ట్ ఫోన్లు బాగా అభివ్రుధ్ధి చెందిన తరువాత చేతిలోనే సినిమాలు వచ్చేశాక, యూట్యూబ్ లో అన్నీ చూసేస్తున్నాక, సినిమా హాల్ బోసిపోతోంది. ఇక ఇంట్లో టీవీలు,చేతిలో ఫోన్లు, ఇపుడు ఓటీటీ ఫ్లాట్ ఫారం ఇవన్నీ వచ్చిన తరువాత థియేటర్ కళ మసకబారిపోతోంది.

IHG

 

ఏపీలో దాదాపు రెండు వేలకు పైగా ధియేటర్లు ఉండేవి,  ఇపుడు బాగా గగ్గిపోయాయి. చాలా సినిమా హాళ్ళల్లో నాలుగు షోలు పడడం మానేసి చాలా కాలమైంది. ఇక సంక్రాంతి, దసరా, సమ్మర్ సీజన్ తప్ప మామూలు రోజుల్లో మంచి సినిమా పడినా వెళ్ళే తీరిక ఓపిక జనాలకు లేవు.

 

IHG

అయినా సరే ముక్కుతూ మూలుగుతూ  మరికొంతకాలం అయినా థియేటర్ బండి లాగిద్దామనుకున్న వారికీ ఇదే వ్యాపారం అయినా వారికి ఇపుడు కరోనా మహమ్మారి వచ్చి కళ్ళు తెరిపించేసింది. సినిమా చూసేందుకు మీ అవసరం లేదు అని గట్టిగా చెప్పేసింది. దాంతో ధియేటర్ల యజమానులు బావురుమంటున్నారు.

IHG

మరో వైపు ప్రముఖ నిర్మాత డీ రామానాయుడు కుమారుడు అయిన సురేష్ బాబు సినిమా థియేటర్లకు ఆల్ట‌ర్నేషన్ గా ఓటీటీ వస్తే తప్పేంటి అని అనడం విశేషం. టెక్నాలజీని ఎవరూ ఆపలేరని కూడా ఆయన అన్నారు. మనం దాన్ని సొంతం చేసుకుని ముందుకు సాగిపోవాల్సిందేనని కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు సినిమా హాళ్ళు ఆదరాబాదరాగా తెరచినా జనం రారు, అపుడు పూర్తిగా మూసుకుని కూర్చోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరో నాలుగు నెలల వరకూ ఆగడం మంచిదని అంటున్నారు. మొత్తానికి థియేటర్ల కాలం చెల్లిందన మాట కూడా అందరిలో వినిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: