ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ చాలామంది నటీమణులు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తూ.. సూస‌ర్ స‌క్సెస్ అవుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అమ్మ‌, బామ్మ, అత్త,  వదిన అంటూ తమకు సూట్ అయ్యే పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. కొంద‌రు విల‌న్ రోల్స్ కూడా ఎంచుకోవ‌డం మ‌రో విశేషం. ఇక నేటి తరం హీరోయిన్స్ కంటే ఎక్కువ అవకాశాలు అందుకోవ‌డంతో పాటు.. అటు మంచి ఆదాయాన్ని ఇటు మంచి గుర్తింపుని దక్కించుకుంటున్నారు.

IHG

ఈ లిస్ట్‌లో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ కూడా చేరింది. 1990వ దశకంలో టాలీవుడ్ లోని అగ్ర హీరోలతో పాటు చాలా మంది యంగ్ హీరోలతో కలిసి నటించింది సిమ్రాన్‌. అంతేకాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఒక్క ఊపు ఊపింది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఉర్దూ భాషలతో పాటు వివిధ చిత్రాల్లో ఆమె నటించింది స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనే తెగ సందడి చేసింది ఈ భామ. ఇక 1997లో విడుదలైన ‘వి.ఐ.పి’ అనే తమిళ మూవీతో హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్​. ఫ‌స్ట్ మూవీతోనే ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్‌ అవార్డును అందుకుంది. 

IHG'Trisha Illeana Nayantara' | | Deccan Abroad

అదే ఏడాది తెలుగులో విడుదలైన ‘అబ్బాయి గారి పెళ్లి’లో నటించి టాలీవుడ్​లో కూడా మంచి విజ‌యాన్ని అందుకుంది. కొంత‌కాలానికి వెండితెర‌కు దూర‌మైన ఈ బ్యూటి.. ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యువ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన‌ 'సీమ రాజ' చిత్రంలో నటించింది. ఇందులో హీరోయిన్‌ స‌మంత‌కు త‌ల్లిగా న‌టిస్తూనే విల‌న్ రూల్ పోషించింది. ఇక ఈ సినిమాలో సిమ్రాన్ న‌ట‌న‌కుగానూ మంచి మార్కులే సంపాదించుకుంది. మ‌రియు ఇన్నాళ్లు అందం, అభినయంతో అలరించిన సిమ్రన్ తనలోని క్రూరత్వంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అలాగే ర‌జ‌నీకాంత్ పేట సినిమాలో కూడా సిమ్రాన్ న‌టించింది. ఇక ప్ర‌స్తుతం పలు సినిమాల ఆఫర్లతో బిజీగా మారింది సిమ్రాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: