సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణ సమయంలో హాస్యనటుడు షకలక శంకర్ ని పవన్ కళ్యాణ్ కొట్టాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో మీరు ఏదో కామెంట్ చేశారని... దాంతో ఆ డిపార్ట్మెంట్ లోని వారంతా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి మీ పైన ఫిర్యాదు చేశారని... అప్పుడు పవన్ మిమల్ని పిలిచి మందలించినట్టు తనకు తెలిసిందని ఒక ఇంటర్వ్యూయర్ చెబుతూ ఇది నిజమా? లేకపోతే మిమ్మల్ని నిజంగానే పవన్ కళ్యాణ్ కొట్టాడా? అని షకలక శంకర్ ని ప్రశ్నించినప్పుడు... తాను మాట్లాడుతూ 'వెంకటేశ్వర స్వామి కి అన్నమయ్య ఎలాగో... శ్రీ రాముడికి రామదాసు ఎలానో... పవన్ కళ్యాణ్ కి నేను కూడా అలాగే. నేను చనిపోయేంతవరకు పవన్ కళ్యాణ్ ని నా దేవుడు గా భావిస్తాను. నాకు పవన్ కళ్యాణ్ కి మధ్య దేవుడికి భక్తుడికి ఉన్న బంధం ఉంటుంది. నచ్చని పనులు చేస్తే దేవుడు భక్తులపై ఎలా కోపడతాడో పవన్ కూడా నా మీద అలానే కోప్పడతాడు. దేవుడు ఎప్పుడూ భక్తిని కొట్టడు. పవన్ కళ్యాణ్ కూడా నన్ను కొట్టలేదు. ఇది తప్ప నేను మరేతర సమాధానం ఇవ్వలేను', అని షకలక శంకర్ చెప్పుకొచ్చాడు. 


తను ఇంకా మాట్లాడుతూ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రీకరణ దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగిందని... ఆ సమయంలో తాను పవన్ కళ్యాణ్ ని బాగా గమనించానని... అప్పుడే పవన్ కళ్యాణ్ ది చీమకు కూడా హాని చేయని మంచి మనస్తత్వం అని తనకు తెలిసిందని... ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నాలాంటి భక్తుని ఎలా కొడతారు అనుకుంటున్నారు? ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి. అందర్నీ ప్రేమగా చూసుకోవాలి అంటే అది దాదాపు అసాధ్యం. ఒకవేళ ఆయన కోప్పడిన మనమే సర్దుకుపోవాలి అని షకలక శంకర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: