ఎవరి పేరు చెబితే అభిమానులకు పూనకాలు వస్తాయో, ఎవరు తొడలు కొడితే రికార్డులు బద్దలు అవుతాయో, ఎవరు మీసాలు తిప్పితే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నెలకొంటాయో అతడే నటసింహ నందమూరి బాలకృష్ణ. జూన్ 10న అనగా ఈరోజు బాలకృష్ణ 59 సంవత్సరాలు పూర్తిచేసుకుని 60 వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్ లో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర విషయం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
జూన్ 13 2003వ సంవత్సరంలో బగ్గిడి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలకి పి గోపాలకృష్ణ పరుచూరి వెంకటేశ్వరరావు స్క్రీన్ ప్లే( డైలాగులు) అందించారు. ఈ సినిమాకి స్టోరీని పోసాని కృష్ణమురళి అందించాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించగా... మణిశర్మ సంగీత బాణీలు అందించాడు. చెన్నకేశవరెడ్డి సినిమా తర్వాత ఎటువంటి సినిమా తీద్దామని బాలకృష్ణ యోచిస్తున్న సమయంలో... వద్దకే పరుచూరి బ్రదర్స్ వచ్చే పలనాటి బ్రహ్మనాయుడు సినిమా కథను వినిపించారు. అయితే అప్పుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కథలో ట్రైను, కుర్చీ సన్నివేశాలు చాలా ఎబెట్టు గా ఉన్నాయి కదా, తేడా కొడితే మనం అందరం నవ్వులపాలు అవుతాం అని పరుచూరి బ్రదర్స్ తో అనగా... లేదు బాబు మీకున్న ఇమేజ్కి అవి చాలా తక్కువ. మీ క్రేజ్ వేరు. మీకు ఉన్న ఫాలోయింగ్ వేరు' అని పరుచూరి బ్రదర్స్ అతడిని కన్విన్స్ చేశారు.
ఆ 2 సన్నివేశాలు మినహాయించి మిగతా కథ తనకు నచ్చిందని బి గోపాల్ ని పిలిచి మీకు ఆ రెండు సన్నివేశాలు ఇష్టమైతే పెట్టండి లేకపోతే లేదు అని చెప్పేసి చిత్రీకరణలో పాల్గొన్నాడు. షూటింగ్ అంతా పూర్తయ్యి సినిమా ప్రేక్షకుల ముందుకి రాగా... బాలకృష్ణ అనుకున్నట్టే ట్రైన్, చైర్ సన్నివేశాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. సినిమా చూసినవా రా తప్పవని వారు ఎవరూ లేరు. బాలయ్య అనుకున్నట్టు జరగడంతో పరుచూరి బ్రదర్స్ కి ఎక్కడ లేని భయం పట్టుకుంది. ఇక్కడ ఉంటే బాలకృష్ణ ఏం చేస్తాడో ఏమో అని పరుచూరి బ్రదర్స్ అమెరికాకి పారిపోయారు.