చేసినటువంటి ఆదేశాలు ఆచరణలో సక్రమంగా చేసి చూపిస్తే ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. గతంలో వైయస్ రాజశేఖర్రెడ్డి ఇలాంటిదే చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి పేద ప్రజలందరూ ఆస్పత్రికి వెళ్లగానే చికిత్స ప్రారంభించారు... ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించడం లాంటివి జరిగింది. అంతేకాకుండా 108 వాహనాలు సక్రమంగా ప్రజలకు ఉపయోగపడేలా ఫోన్ చేయగానే సరైన టైంకి వచ్చాయి. అందుకే అప్పట్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పథకంలో నిబంధనల పేరుతో మరింత ఈ పథకాలను తగ్గిస్తూ వచ్చాయి తప్ప పెంచలేదు. అందుకే ఒక రాజశేఖర్ రెడ్డి తప్ప మిగతా ఏ ప్రభుత్వం కూడా ప్రజల్లో మనసుల్లో నిలిచి పోలేదు.
ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక నేరుగా ప్రజల ఖాతాలో డబ్బు జమ అయ్యే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే మరొకటి ఒక కీలకమైన అటువంటి అంశం తెరమీదకి వచ్చింది. రేషన్ కార్డులు పింఛన్లు కార్డులు ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పటి వరకు జగన్ సర్కార్కు ఇవ్వ లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిపై ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
పింఛన్ అప్లై చేసినవారికి పది రోజుల లోపు పింఛన్ కార్డు రావాలని అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసినవారికి ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజుల్లో వచ్చేలా చర్యలు చేపట్టాలని... 90రోజుల్లో రిజిస్ట్రేషన్ అయ్యేలా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు అంటే.. దీనిపై విచక్షణాధికారం ఎవరికైనా ఇవ్వాలి అంటున్నారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై సమర్థవంతంగా నిర్వర్తించే విదంగా అన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఒక వ్యక్తికి విచనాదికారం ఇస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.