షూటింగులకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. అయితే షూటింగులు ప్రారంభించడానికి జంకుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది కరోనా. సినిమా షూటింగులు అంటే చాలా హడావుడి ఉంటుంది. హడావుడి అంటే కరోనాకు అసలు గిట్టదు. అందువల్ల కరోనా మహమ్మారికి భయపడి చాలా మంది షూటింగులు వద్దు అనేస్తున్నారు.

IHG

ఇదే విషయాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తికపూర్ అంటున్నారు. షూటింగులకు మహారాష్ట్ర సర్కార్ అనుమతించినా ఇప్పట్లో ప్రారంభించకపోవడమే మంచిదని ఆయన అంటున్నారు. ఒకవేళ ప్రారంభిస్తే మాత్రం గందరగోళ పరిస్థితులు ఉంటాయని కూడా అంటున్నారు.

IHG

తన వరకూ తీసుకుంటే తన కుమార్తె శ్రద్ధాకపూర్ ని షూటింగులకు అసలు పంపనని పక్కా క్లారిటీగా  చెప్పేస్తున్నారు. తనకు కూడా ఇపుడు షూటింగులు అవసరం లేదని అన్నారు. తన సన్నిహితులైన వారందరికీ ఇదే విషయాన్ని చెబుతున్నానని చెప్పుకొచ్చారు. షూటింగులు ఇపుడు చేస్తే చాలా డేంజర్ అని కూడా ఆయన అంటున్నారు.

IHG

అంతేకాదు, రానున్న రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని ఆయన చెబుతున్నారు. అందువల్ల సినిమా షూటింగులు అన్న మాటను కొంతకాలం జనాలు మరచిపోవడం మంచిదని  సినిమా వారికి శక్తికపూర్ సూచిస్తున్నారు. ఇక తండ్రి మాటకు శ్రధ్ధాకపూర్ కూడా సరేనని అంటోంది. ప్రాణం ఉంటేనే ఏదైనా అని కూడా అంటోంది.  మరి ఆయన చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి. కానీ షూటింగులకు కొంతమంది రేడీ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

IHG

 

నిజానికి ఇపుడు ముంబై సహా మహారాష్ట్ర అంతటా కరోనా తీవ్రంగా ఉంది. దాంతో బాలీవుడ్ అంతా వణుకుతోంది. షూటింగులతో కొత్త తలనొప్పులు వస్తాయని కూడా కలవరపడుతోంది. దాంతో శ్రధ్ధాకపూర్ బాటలోనే అంతా నడుస్తారేమో  చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: