maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన చెన్నై ముద్దుగుమ్మ సమంత గత 10 సంవత్సరాల్లో తెలుగు, తమిళ పరిశ్రమలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. యు టర్న్, ఓహ్ బేబీ, సూపర్ డీలక్స్ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించిన ఈమె సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని గొప్ప నటీమణిలలో ఒకరిగా నిలుస్తుంది. ఈమె 2017 వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన నాగార్జున కుమారుడైన అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకుందన్న విషయం విదితమే. అయితే 2017, జూన్ నెలలో తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత ఫుడ్, సెక్స్ అంశాలపై బోల్డ్ కామెంట్స్ చేసింది.
ఆ సమయానికి తాను నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. పెళ్లి చేసుకోక ముందుకే తను వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇంతకీ ఇంటర్వ్యూ లో ఆమె ఏమి అడిగారంటే... సెక్స్, ఆహారం... ఈ రెండిట్లో మీరు ఎక్కువగా ఏది ఇష్టపడతారు (ఆహారం ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువగా అవసరం)అని ప్రశ్నించగా... తాను ఏ మాత్రం భయపడకుండా 'ఆహారం తినడం కంటే సెక్స్ చేయడానికి నేను ఎక్కువగా (ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను) ఇష్టపడతాను. ఒకరోజు ఆకలితో అలమటించిన నాకు బాధ అనిపించదు', అని బోల్డ్ కామెంట్స్ చేసింది.
సమంత చేసిన వ్యాఖ్యలు ఆమె అభిమానుల విస్మయానికి కారణమయ్యాయి. కాని తను ఏమనుకుంటుందో అది నిస్సిగ్గుగా, అభయంగా చెప్పడం వలన కొంతమంది తనని బాగా మెచ్చుకున్నారు. అప్పట్లో కేవలం తన కామెంట్స్ తోనే కాదు తన అందచందాలను నెట్టింట ఆరబోస్తూ అభిమానులకు హీటెక్కించింది సమంత.
ప్రస్తుతం ఆమె తన భర్త నాగ చైతన్య తో కలసి సరదాగా సమయాన్ని గడుపుతున్నది. తన పుట్టిన రోజు సందర్భంగా నాగచైతన్య చాక్లెట్ కేక్ తయారు చేసి ఇచ్చాడు. పెళ్లయిన తర్వాత పూర్తి సంప్రదాయకంగా మారిపోయిన సమంత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.